ఫ్యాన్‌కు ఉరేసుకుని పీహెచ్‌డీ విద్యార్ధి ఆత్మహత్య (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీహెచ్‌డీ వసతి గృహంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని జమ్మూకశ్మీర్ వ్యక్తిగా గుర్తించారు.

స్వైన్‌ఫ్లూతో మరో ముగ్గురు మృతి, 49కి చేరిన మృతుల సంఖ్య
స్వైన్‌ఫ్లూ వైరస్ బారిన పడి తెలంగాణలో శుక్రవారం మరో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూతో మృతిచెందిన వారి సంఖ్య 49కి చేరింది. 24 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ వైద్యశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

గురువారం 78 రక్తపు నమూనాలను పరీక్షించగా 24 మందికి స్వైన్‌ఫ్లూ పాజిటీవ్‌గా తేలినట్టు వెల్లడించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 19 వరకు 3,649 రక్తపు నమునాలను పరీక్షించగా 1,186 స్వైన్‌ఫ్లూ పాజిటీవ్ కేసులుగా నమోదైనట్టు తెలిపారు. కాగా, గురువారం అధికారులు ప్రకంటించిన బులిటిన్‌లో స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి సంఖ్య 46గా పేర్కొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications