వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మార్ట్‌ఫోన్లో గుండెచప్పుడు: అపోలో 'ఈసీజీ' (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసుకునేందుకు ఇక నుండి కార్పోరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగే బాధలు తప్పనున్నాయి.

ఆండ్రాయిడ్ కలిగిన స్మార్ట్ ఫోన్లో గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసుకునేందుకు వీలుగా హెల్త్ కేర్ సర్వీసుల్లో అగ్రగామి సంస్థ అపోలో, అమెరికా కేంద్ర స్థానంగా సర్వీసులు అందిస్తున్న అలైప్‌కార్ సంయుక్త భాగస్వామ్యంలో ఈసీజీని తీసే ప్రత్యేక పరికరాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఈ పరికరాన్ని స్మార్ట్ ఫోన్ వెనుక వైపు అంటించి రెండు అరచేతులతో గట్టిగా పట్టుకుంటే సరిపోతుంది. ఈ డివైజ్ ద్వారా మొబైల్లో గుండె కొట్టుకుంటున్న తీరును సింగిల్ ఛానెల్ ఎలక్ట్రోకార్డియోగ్రాం (ఈసీజీ) రికార్డు అవనున్నది.

స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈసీజీ

స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈసీజీ

ఈ ప్రత్యేక పరికరం ధరను రెండు వందల డాలర్లు..( మన కరెన్సీలో రూ.12వేలు)గా నిర్ణయించినట్లు అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాపి సీ రెడ్డి తెలిపారు.

స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈసీజీ

స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈసీజీ

ఈ పరికరం ద్వారా తీసిన ఈసీజీ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే నెలకు అదనంగా రూ.3వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

 స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈసీజీ

స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈసీజీ

వ్యాపార విస్తరణలో భాగంగా రూ.2,500 కోట్ల పెట్టుబడితో 2,500 పడకల ఆసుపత్రుల ఏర్పాటు కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

 స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈసీజీ

స్మార్ట్ ఫోన్ల ద్వారా ఈసీజీ

ఇప్పటి వరకు వెయ్యి పడకలు జతయ్యాయని తెలిపారు. మరో ఏడాదిన్నరలోగా మిగతా 1,500 పడకలు అందుబాటులోకి రానున్నట్లు ఆయన తెలిపారు.

English summary

 Apollo Hospitals has tied up with the US-based AliveCor Inc. to provide mobile electrocardiogram (ECG) devices to patients suffering from arrhythmias.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X