వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కవిత, విహెచ్ ఒకరికొకరు: మోత్కుపల్లి వెరైటీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంగళవారం రెండుసార్లు వాయిదా పడిన అనంతరం మూడోసారి ప్రారంభమైన సభ బుధవారం నాటికి వాయిదా పడ్డాయి. రెండోసారి వాయిదా పడిన అనంతరం తిరిగి సభ ప్రారంభమైనా పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు.

ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క బిల్లుపై చర్చకు సభ్యులు సహకరించాలని, అందరూ పాల్గొని చర్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సభ్యులు వినక పోడియం చుట్టిముట్టి జై సమైక్యాంధ్చ, జై తెలంగాణ నినాదాలు చేశారు.

ఎవరి సీట్లలో వాళ్లు కూర్చోవాలని కోరినా, సభ్యులు పట్టించుకోలేదు. ఏ పార్టీకి చెందిన సభ్యులను ఆ పార్టీ ఫ్లోర్ లీడర్లు అదుపులో పెట్టాలని, సీట్లలో కూర్చోమని చెప్పాల్సిందిగా మల్లుభట్టి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

అసెంబ్లీ 1

అసెంబ్లీ 1

మంగళవారం ఉదయం సభ ప్రారంభంకాగానే సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ 2

అసెంబ్లీ 2

లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం మీడియా పాయింటువద్ద మాట్లాడుతూ... రాజకీయ ప్రయోజనాల కోసం, అధికారం కోసం తెలుగు గడ్డను బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలాగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం

ఏర్పాటు కావడం తెలంగాణ రాష్ట్ర సమితికి ఏమాత్రం ఇష్టం లేదన్నారు.

అసెంబ్లీ 3

అసెంబ్లీ 3

ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలు విభజన జరగకుండా కుట్ర పన్నుతున్నారని, వాటిని ఛేదించాల్సిన అవసరముందని గండ్ర వెంకట రమణ రెడ్డి అన్నారు.

అసెంబ్లీ 4

అసెంబ్లీ 4

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన వెంటనే సభలో చర్చించాలని లేదంటే, సీమాంధ్ర ప్రాంత ప్రజలకే నష్టమని బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు.

అసెంబ్లీ 5

అసెంబ్లీ 5

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లను గెలిపించి కృతజ్ఞత చాటుకోవాలని వి హనుమంత రావు అన్నారు.

అసెంబ్లీ 6

అసెంబ్లీ 6

ముఖ్యమంత్రి సభకు హాజరై తెలంగాణ బిల్లులోని లోపాలను ప్రజలకు వివరించాలని టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ బిల్లులో లోపాలున్నాయని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి చెప్పిందని

ఉమా తెలిపారు.

అసెంబ్లీ 7

అసెంబ్లీ 7

తెలంగాణ బిల్లును అడ్డుకోజూస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ సెగ తగులుతుందని పోచారం మండిపడ్డారు.

అసెంబ్లీ 8

అసెంబ్లీ 8

అసెంబ్లీ ప్రాంగణంలో సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడుతున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెసు రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు.

అసెంబ్లీ 9

అసెంబ్లీ 9

మంగళవారం ఉదయం అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా శాసన సభ్యులు.

అసెంబ్లీ 10

అసెంబ్లీ 10

మంగళవారం ఉదయం అసెంబ్లీలోని మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఎర్రబెల్లి, మోత్కుపల్లి తదితరులు.

అసెంబ్లీ 11

అసెంబ్లీ 11

అసెంబ్లీ ప్రాంగణంలో లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణకు టి బిల్లుకు సంబంధించి ఓ ప్రతిని చూపిస్తున్న తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు.

అసెంబ్లీ 12

అసెంబ్లీ 12

శాసన సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ లోపలి నుండి వస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ 13

అసెంబ్లీ 13

మంగళవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు శోభా నాగి రెడ్డి, తదితరులు.

అసెంబ్లీ 14

అసెంబ్లీ 14

వరంగల్ జిల్లా మహబూబాబాద్ శాసన సభ్యురాలు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మాలోతు కవిత అసెంబ్లీకి మిఠాయిలు తెచ్చి పంచారు.

అసెంబ్లీ 15

అసెంబ్లీ 15

వరంగల్ జిల్లా మహబూబాబాద్ శాసన సభ్యురాలు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మాలోతు కవితకు మిఠాయి తినిపిస్తున్న వి హనుమంత రావు.

అసెంబ్లీ 16

అసెంబ్లీ 16

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు మాట్లాడుతుండగా లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్‌పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ చిరునవ్వు.

అసెంబ్లీ 17

అసెంబ్లీ 17

అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు.

అసెంబ్లీ 18

అసెంబ్లీ 18

కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావుకు మిఠాయి తినిపిస్తున్న వరంగల్ జిల్లా మహబూబాబాద్ శాసన సభ్యురాలు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మాలోతు కవిత.

అసెంబ్లీ 19

అసెంబ్లీ 19

సోమవారం నాటి బిఎసి సమావేశంలో చర్చ జరగాలని సభ్యులందరూ చెప్పారని స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పినప్పటికీ సభ్యులు తమ ఆందోళనలను విరమించలేదు. దీంతో సభ ప్రారంభమైన మూడు నిమిషాలకే మొదటిసారి గంటపాటు వాయిదా పడింది.

అసెంబ్లీ 20

అసెంబ్లీ 20

శాసన సభ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ లోపలి నుండి వస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు.

అసెంబ్లీ 21

అసెంబ్లీ 21

అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకులు శ్రీధర్ బాబుతో సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల ముచ్చట్లు.

English summary
On Tuesday, the Assembly was adjourned amidst uproarious scenes after legislators from Seemandhra and Telangana regions stalled the proceedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X