కేసీఆర్ ఆదేశం, సింగిరెడ్డి షాక్: కూల్చివేతలు (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాల పైన తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝులిపిస్తూనే ఉంది. బుధవారం నగరం, శివారు ప్రాంతాల్లో కూల్చివేత కార్యక్రమం కొనసాగింది. సర్కిల్ 1లోని కాప్రా సర్కిల్ పరిధిలో రెండు, సర్కిల్ 2,4,5ల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మాణాలను కూల్చివేశారు. ఐఎస్ సదన్‌లో కూల్చివేతల కార్య క్రమాన్ని టిడిపి ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి అడ్డుకుని వాగ్వివాదానికి దిగడంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు.
సర్కిల్ 6, 7, 11ల్లో రెండు, తొమ్మిదిలో ఓ అక్రమ నిర్మాణంలో అదనంగా నిర్మించిన భాగాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు సర్కిల్ 12, 14, 18ల్లో మరో రెండు భవనాలు చొప్పున కూల్చేసిన అధికారులు సర్కిల్ 13లోని ఓ భవనంలోని రెండు అంతస్తులు అనధికారికంగా నిర్మించినట్లు గుర్తించి కూల్చివేశారు. కాగా, ఐఎస్‌సదన్ డివిజన్ పరిధిలోని ఓ నిర్మాణం కూల్చివేతను గ్రేటర్ టిడిపి ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనుదిరిగారు.
టిడిపి, బిజెపి ప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దారుసలాం నిర్మాణాలు కూల్చివేసే దమ్ముందా అని టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రశ్నించారు. మజ్లిస్ ఎమ్మెల్యేల ఇళ్లకు అనుమతులు ఉన్నాయా, టాక్స్‌లు సక్రమంగా చెల్లిస్తున్నారని నిలదీశారు. అధికారులు కూల్చివేతలు ఆపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురుకుల్ ట్రస్ట్ భూములలో కూల్చివేతలు జరిపిన విషయం తెలిసిందే.
జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత గురువారం మూడో రోజు కూడా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ సిబ్బంది గురువారం ఉదయం బిఎన్ రెడ్డి నగర్‌లో, కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. స్థానికులు, వివిధ పార్టీల నాయకులు అధికారులను అడ్డుకొని వాగ్వాదానికి దిగుతున్నారు.

కూల్చివేతలు
బుధవారం నగరం, శివారు ప్రాంతాల్లో కూల్చివేత కార్యక్రమం కొనసాగింది. సర్కిల్ 1లోని కాప్రా సర్కిల్ పరిధిలో రెండు, సర్కిల్ 2,4,5ల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్మాణాలను కూల్చివేశారు.

కూల్చివేతలు
సర్కిల్ 6, 7, 11ల్లో రెండు, తొమ్మిదిలో ఓ అక్రమ నిర్మాణంలో అదనంగా నిర్మించిన భాగాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.

కూల్చివేతలు
వీటితో పాటు సర్కిల్ 12, 14, 18ల్లో మరో రెండు భవనాలు చొప్పున కూల్చేసిన అధికారులు సర్కిల్ 13లోని ఓ భవనంలోని రెండు అంతస్తులు అనధికారికంగా నిర్మించినట్లు గుర్తించి కూల్చివేశారు.

గురుకుల్
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురుకుల్ ట్రస్ట్ భూములలో కూల్చివేతలు జరిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications