వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీపై తగ్గుతా: బాబు చేతుల మీదుగా బాలయ్య, కల్సిన యూకే మంత్రి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రూ.1400 కోట్లు ఖర్చుపెట్టి కరెంటు కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా కరెంటు ఇవ్వగలుగుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం అన్నారు. విదేశాల నుంచి బొగ్గు తెప్పించానని, థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానన్నారు.

అధికారులను అప్రమత్తం చేసి పని చేయించుకొంటున్నానని, విశాఖలో హుధుద్ తాకిడికి 50వేల స్తంభాలు పడిపోతే 15 రోజుల్లోనే వాటన్నింటినీ వేయించగలిగామన్నారు. విద్యుత్తు విషయంలో తాను ఏ తప్పు చేయలేదని, తెలంగాణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, ఆరు నెలలైనా ఇంకా తనను, తన పార్టీని విమర్శించే తెరాస ప్రభుత్వం పొద్దు పుచ్చుతోందని చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో అన్నారు.

తెలంగాణలో విద్యుత్తురంగాన్ని బాగు చేసే శక్తి టీడీపీకే ఉందని బాబు స్పష్టం చేశారు. తెలంగాణలో 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, దానిని ఏ శక్తీ ఆపలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో టీడీపీ నోరు నొక్కడానికి బ్లూస్టార్‌ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని, ఎన్ని చేసినా టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబుతో బాలకృష్ణ

చంద్రబాబుతో బాలకృష్ణ

టీడీపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు.

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నడుమ సమస్యల పరిష్కారానికి ఓ అడుగు వెనక్కి తగ్గడానికీ సిద్ధమేనని చంద్రబాబు ప్రకటించారు. ఏపీ అభివృద్ధికి శ్రమిస్తూనే తెలంగాణ బాగు కోసం కృషి చేస్తానన్నారు. 2019లో తెలంగాణలో టీడీపీ విజయాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి టీటీడీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు

రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయని, రెండేళ్లలో మనమే పరిష్కరించుకోవాలని, లేదంటే కేంద్రం, కోర్టులు జోక్యం తప్పదని, వివాదాలతో ఎవరికీ ఉపయోగం ఉండదని, కరెంటు పైన సహకరించేందుకు సిద్ధమని 2019లో తెలంగాణలో టీడీపీ విజయాన్ని ఏ శక్తి ఆపదన్నారు.

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా శనివారం ఎన్టీఆర్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర టీడీపీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పొరుగు రాష్ట్రాలన్నింటితో సన్నిహిత సంబంధాలు ఉండాలని తాను ప్రయత్నిస్తున్నానని, తెలంగాణతో మరింత బాగుండాలని కోరుకుంటున్నానన్నారు.

యూకే మంత్రి

యూకే మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం ఆయన నివాసంలో కలిసిన యూకే మంత్రి డాన్ బేయెల్స్.

కోడెల

కోడెల

ఏపీ శాసన సభా సభాపతి కోడెల శివప్రసాద్, కెన్యా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివ రావులు ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన దృశ్యం.

రైతులతో చంద్రబాబు

రైతులతో చంద్రబాబు

రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తున్న రైతులకు మరింత మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యోచిస్తోంది.

రైతులతో చంద్రబాబు

రైతులతో చంద్రబాబు

తమకు ఇస్తున్న ప్యాకేజీ చాలడం లేదని కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఇక్కడ రాజధాని కమిటీ సభ్యులతో సమావేశమై చర్చించారు.

రైతులతో చంద్రబాబు

రైతులతో చంద్రబాబు

మాగాణి ప్రాంత రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో వారికి ఇచ్చే పరిహారం పెంచాలన్న యోచన ఈ సమావేశంలో వ్యక్తమైంది.

రైతులతో చంద్రబాబు

రైతులతో చంద్రబాబు

మెట్ట, మాగాణి రైతులను రెండు విభాగాలుగాచేసి.. పంట నష్టానికి ప్రతిఫలంగా ఏడాదికి ఇచ్చే పరిహారాన్ని మాగాణి రైతులకు పెంచాలని నిర్ణయించారు.

రైతులతో చంద్రబాబు

రైతులతో చంద్రబాబు

రుణమాఫీపై విధివిధానాలను ఖరారు చేసిన ప్రభుత్వం తన షెడ్యూల్‌ ప్రకారం రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను బ్యాంకులకు పంపింది.

రైతులతో చంద్రబాబు

రైతులతో చంద్రబాబు

శనివారం సాయంత్రం ఈ జాబితాను అన్ని బ్యాంకులకు పంపినట్లు రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు తెలిపారు.

రావెల

రావెల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని ప్రారంభించారు.

English summary
AP CM Chandrababu Naidu, is seen releasing the poster of AMBEDKAR OVERSEAS VIDYA NIDHI Scheme which is launching.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X