పిక్చర్స్: కలబడ్డారు, ధర్నాలో మహిళలు ఏడ్చారు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రాజమండ్రి అర్బన్ కాంగ్రెస్ శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు, తెలుగుదేశం నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి పరస్పరం కలబడ్డారు. గోరంట్లతోపాటు ఇతర తెలుగుదేశం నేతలకు, లబ్ధిదారులకు స్వల్పగాయాలయ్యాయి.
రాజమండ్రిలో ఇందిరమ్మ పథకం కింద 2008 లో 2,556 వాంబే గృహాలను నిర్మించగా గురువారం జిల్లా హౌసింగ్ అధికారులు లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారులను పిలిచారు. ఈ సందర్భంలో రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు మాట్లాడుతుండగా - తెలుగుదేశం పార్టీ నేత బుచ్చయ్యచౌదరి అక్కడికి వచ్చి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్‌కు చెప్పకుండా ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారని ప్రశ్నించారు.
అనర్హులకు లబ్ధి చేకూర్చుతున్నారని గోరంట్ల ఆరోపించగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాను ముఖ్యమంత్రిని కోరడం వల్లే ఇళ్లు మంజూరయ్యాయని తనకు తెలియజేయకుండా అర్బన్ ఎమ్మెల్యేను తీసుకురావడం అన్యాయమని ఎమ్మెల్యే చందన రమేష్ అన్నారు.

మొదట ప్రశాంతమే..
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో మొదట ఇలా మామూలుగానే ఉంది. లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారులను అధికారులు పిలిచారు.

బాహాబాహీకి దిగారు..
ఇళ్ల కేటాయింంపు సందర్భంగా తెలుగుదేశం నాయకుడు బుచ్చయ్య చౌదరి అక్కడికి వచ్చి ఎవరికీ చెప్పకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారని విమర్శించడంతో వాతావరణం వేడెక్కింది.

ఎమ్మెల్యే రౌతు విమర్శ..
తాను పేదల కోసం ఇళ్లను కేటాయిస్తుంటే అడ్డుకుంటున్నారని రౌతు అనండంతో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు గోరంట్లపై చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో గోరంట్లతోపాటు కొందరు లబ్ధిదారులకు గాయాలయ్యాయి.

అంతా చిందరవందర..
ఇళ్ల కేటాయింపు కార్యక్రమంలో తెలుగుదేశం, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య బాహాబాహీ జరగడంతో పరిస్థితి అంతా చిందరవందరగా మారింది.

పరిస్థితి ఉద్రిక్తం..
తెలుగుదేశం పార్టీ నాయకులు బుచ్చయ్య చౌదరితో పాటు ఇతరులు వాగ్వివాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

మహిళల కంట నీరు..
తెలుగుదేశం నాయకుల తీరుకు నిరసనగా మహిళలు ధర్నాకు దిగారు. కంట నీరు పెట్టుకున్నారు. రోడ్డుపై బైఠాయించారు.

కంటతడి పెట్టిన రౌతు
పేదలకు ఇళ్లు కేటాయిస్తుంటే గోరంట్ల ఓర్వలేకపోతున్నారని మహిళలపై దాడిచేసి కొట్టారని ఎమ్మెల్యే రౌతు కంటనీరు పెట్టుకున్నారు.

మీడియాతో బుచ్చయ్య
ఘర్షణ తర్వాత గోరంట్ల మీడియాతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

బుచ్చయ్య చౌదరిపైకి రాళ్లు
కార్యక్రమానికి వచ్చిన నిలదీసిన తెలుగుదేశం నాయకులపై మహిళలు రాళ్లు రువ్వారు, పూర్తిగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.

రౌతు, బుచ్చయ్య కలబడ్డారు..
కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం నేత బుచ్చయ్య చౌదరి, శాసనసభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు కలబడ్డారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications