బాబుకు కోకాకోలా ప్రతినిధి హామీ, కవిత భేటీ (పిక్చర్స్)
హైదరాబాద్: పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులను కలుస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో తమ పరిశ్రమల స్థాపన, విస్తరణపై ప్రతిపాదిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరిన్ని సంస్థలను ఏర్పాటు చేసేందుకు కోకకోలా సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు ఇరియన్ ఫిన్నాన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం భేటీ అయ్యారు.
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలను చంద్రబాబు వివరించారు.

కోకాకోలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ యూనిట్లు స్థాపించేందుకు, ఇప్పటికే ఉన్న కోకకోలా యూనిట్లను ఆధునీకరించేందుకు ఫిన్నాన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఫిన్నాన్ సానుకూలంగా స్పందించారని, తమ మధ్య చర్చలు ఫలవంతమయ్యాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

కోకాకోలా
రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, మానవ వనరులకు కూడా కొదవ లేదని చంద్రబాబు వెల్లడించారు. అందుకే దేశ విదేశీ సంస్థలు తమ పరిశ్రమలను రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటీ రెండు మెగా బాట్లింగ్ ప్లాంట్లకు అవసరమైన భూమిని గుర్తిస్తామని బాబు చెప్పారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి సహకరిస్తామని ఫిన్నన్ బాబుకు హామీ ఇచ్చారు.

చంద్రబాబు
ఖమ్మం జెడ్పీ చైర్ పర్సన్ కవిత, వైస్ చైర్మన్ వాసుదేవ రావులు సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

చంద్రబాబు
ఖమ్మం జెడ్పీ చైర్ పర్సన్ కవిత, వైస్ చైర్మన్ వాసుదేవ రావులు సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. చిత్రంలో ఎమ్మెల్యే వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణలు ఉన్నారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications