వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్‌తో టర్కీ కౌన్సెల్ జనరల్, స్మితకు ఆర్డర్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల పైన సమీక్ష నిర్వహించారు.

అలాగే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కేసీఆర్ త్వరలో పర్యటించనున్నారు. దీని పైన కూడా సమీక్ష సమావేశాలు అధికారులతో నిర్వహించారు.

మరోవైపు, టర్కీ కౌన్సెల్ జనరల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం కలుసుకున్నారు. టర్కీ జాతీయ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు.

స్వాతంత్ర దినోత్సవం

స్వాతంత్ర దినోత్సవం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం సచివాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల పైన సమీక్ష నిర్వహించారు.

కేసీఆర్

కేసీఆర్

ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలిసారి కరీంనగర్ జిల్లాకు మంగళవారం వెళ్లనున్నారు. ఈ నెల 6వ తేదీన జయశంకర్‌ జయంతిని హైదరాబాద్‌లో జరుపుకొని, 7వ తేదీన నిజామాబాద్‌ జిల్లాలో, ఆ తర్వాత ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఈనేపథ్యంలో సచివాలయంలో మంత్రులు ఈటెల రాజేందర్‌, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో సీఎం భేటీ అయ్యారు.

కేసీఆర్

కేసీఆర్

కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉందని, దీనిపై సత్వరం దృష్టి పెట్టాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు ఒకరోజు ముందే కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు వెళ్లాలని సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సభర్వాల్‌ను ఆదేశించారు. దాంతో ఆమె హుటాహుటీన ఆ జిల్లాలకు తరలివెళ్లారు.

టర్కీ

టర్కీ

టర్కీ కౌన్సెల్ జనరల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం కలుసుకున్నారు. టర్కీ జాతీయ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించారు.

English summary
Photos of KCR review meeting on Independence day celebrations at Secretariate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X