వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు చేస్తే..: ఆంధ్రా ఆపరేటర్లపై టీ మంత్రి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు నడుపుతున్న ప్రైవేటు వాహనాల వారు ఎలాంటి తప్పులు చేసినా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే వారి వాహనాలను నిలిపివేస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో శనివారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణలో ప్రైవేటు వాహనాలు నడిపేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారిని ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణలో చదువుతున్న ఏపీ రాష్ట్ర విద్యార్థులకు బస్సు పాసులను జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామన్నారు. ఉద్యోగుల పాసుల విషయంలోనూ ఆలోచన చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని మంత్రి చెప్పాు. ముంబై నగరంలో ప్రజారవాణా వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఆగస్టు 5, 6 తేదీల్లో అధ్యయనం కోసం అధికారుల బృందం ముంబైలో పర్యటిస్తుందన్నారు. ఈ అధ్యయన బృందానికి చైర్మన్‌గా తానే వ్యవహరిస్తానన్నారు.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

ట్రాఫిక్‌ నియంత్రణ, ఆర్‌టీసీ నిర్వహణ, భద్రత తదితర అంశాలను ముంబై పర్యటనలో అధ్యయనం చేస్తామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. పర్యటన అనంతరం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తామన్నారు.

మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రోజుకు 85 లక్షల మంది ప్రయాణికులు నిత్యం ఆర్టీసీ సేవలు పొందుతున్నారని, ఇందులో 35 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతోపాటు ఆర్టీసీ నిధులతో 80 ఓల్వో బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు.

 మహేందర్ రెడ్డి

మహేందర్ రెడ్డి

హైదరాబాద్‌ శివారులో కొత్తగా 10 డిపోలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందన్నారు. బస్సు సౌకర్యం లేని 1300 గ్రామాలకు రహదారులను మెరుగుపరిచి బస్సులు నడుపుతామన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రజలపై ఎట్టి పరిస్థితుల్లో భారం పడనీయబోమన్నారు. ఆర్టీసీ ఆస్తుల పంపకాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.

 కేసీఆర్

కేసీఆర్

తెలంగాణలో చదువుతున్న ఏపీ రాష్ట్ర విద్యార్థులకు బస్సు పాసులను జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తామన్నారు.

English summary
Photos Mahender Reddy, minister for Transport of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X