జగన్‌కు ఝలక్: టీడీపీలోకి మేయర్, ఆనం (పిక్చర్స్)
హైదరాబాద్/నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌తోపాటు మరో 12మంది కార్పొరేటర్లు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగర కన్వీనర్ ఆనం వెంకట రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
సోమవారం లేక్‌వ్యూ అతిథి గృహంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం మధ్యాహ్నం రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పి నారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర నెల్లూరు మేయర్ అబ్దు అజీజ్, 12 మంది కార్పొరేటర్లు, ఆనం వెంకటరమణా రెడ్డిలను చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్‌తో పాటు పలువురు నేతలు టీడీపీలో చేరడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ అని చెప్పవచ్చు.

నెల్లూరు మేయర్
టీడీపీలో చేరిన అజీజ్ మాట్లాడుతూ చంద్రబాబు చేసే అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు వీలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చేరినట్టు చెప్పారు. నెల్లూరు నగరాన్ని చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశీస్సులతో రాష్ట్ర మంత్రి డాక్టర్ పి నారాయణ, తెలుగుదేశం జిల్లా నాయకుల సహకారంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

నెల్లూరు మేయర్
ప్రజలు తనపై నమ్మకంతో తనను గెలిపించారని, నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించి వారికి మంచి పాలన అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని అజీజ్ అన్నారు. పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అజీజ్ పేర్కొన్నారు.

చంద్రబాబు, నారాయణ
నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు.

వైయస్ జగన్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కడప, కర్నూలు తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పట్టు ఉంది. ఇలాంటి నెల్లూరు నుండి మేయర్ టీడీపీలోకి జంప్ కావడం వైయస్ జగన్‌కు షాకే.












Click it and Unblock the Notifications