జెడ్పీలో ట్విస్ట్: చైర్మన్‌ను నేనే! (పిక్చర్స్)
ఒంగోలు: జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి విషయంలో ఇప్పటి దాకా కొనసాగిన సంక్షోభం ఇక ముగిసిందనుకుంటున్నానని, పూర్తి కాలం తానే చైర్మన్‌గా వ్యవహరిస్తాననే నమ్మకముందని, మా టీడీపీ కుటుంబంలో ఉన్న చిన్నకలహాల కారణంగానే ఈపరిస్థితి నెలకొందని, ఇకపై ఆ ఇబ్బంది ఉండదనుకుంటున్నానని, హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పిచ్చిందని, కలెక్టర్ తనపై వేసిన విప్‌ధిక్కరణను సస్పెండ్ చేసిందని ప్రకాశం జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈదర హరిబాబు సోమవారం అన్నారు.
ఒంగోలులో ఆయన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. చైర్మన్ సీటులో కూర్చున్నా అంతగా రాజకీయాలు మాట్లాడటం సబబు కాదన్నారు. ఎక్కువ మంది మెజార్టీ జడ్పీ టీసీలతో చైర్మన్‌గా ఎంపికైనా తాను మూడు నెలల పాటు పదవికి దూరంగా ఉండటానికి గల కారణాలను వివరించారు.
విప్ ధిక్కరణకు తాను పాల్పడలేదని మరోసారి గట్టిగా సమర్ధించుకున్నారు. చైర్మన్‌గా తాను మళ్ళీ బా ధ్యతలు చేపట్టాల్సిన అవసరంలేదని అన్నారు. నాకు అనుకూలంగా ఈనెల 7వ తేదీనే తీర్పు వచ్చింది. 8వ తేదీ నుంచి నేను జడ్పీ చైర్మన్‌నే. ఇక రాజకీయాలను పక్కన పెట్టిజిల్లా అభివృద్ధికి కృషిచేస్తానన్నారు.

ప్రకాశం జెడ్పీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో నవ్యాంద్ర నిర్మాణంలో తాను సైతం భాగ స్వాముడినవుతానని ఈదర హరిబాబు అన్నారు.

ప్రకాశం జెడ్పీ
మీరు కార్యాలయానికి వస్తుంటే సీఈవో గాని, ఇతర జిల్లా పరిషత్ అధికారులు లేకపోవటాన్ని ఎలా భావిస్తారు అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు.

ప్రకాశం జెడ్పీ
జడ్పీ కార్యాలయానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూడు నెలల్లో పాలనలో తన ముద్రవేస్తానని ఈదర అన్నారు.

ప్రకాశం జెడ్పీ
ఈదర హరిబాబు కోర్టు ఉత్తర్వులను పాటించడంలో ఆప్రజాస్వామ్యంగా వ్యవ హరించారని నూకసాని బాలాజీ తీవ్రంగా మండిపడ్డారు. అది అధికార దురంహాకమన్నారు.












Click it and Unblock the Notifications