సమైక్య: వీరు రాజీనామా చేయాలి, అరగుండు(పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. పలు జిల్లాలో వివిధ రూపాల్లో సమైక్యవాదులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాస్తారోకోలు, మానవహారాలు, లక్షగళ గర్జనతో తమ నిరసనను తెలియజేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో షార్ ఉద్యోగులను సమైక్యవాదులు అడ్డుకున్నారు. చమురు క్షేత్రాలను ముట్టడించారు. మంత్రి శత్రుచర్ల విజయ రామరాజును శ్రీకాకుళం జిల్లా పాలకొండలో అడ్డుకున్నారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు.

విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే జయమణిని సమైక్యవాదులు అడ్డుకోవడంతో ఆయన వెనుదిరిగారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల యాత్ర తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెంలో కొనసాగుతోంది.

ర్యాలీ

ర్యాలీ

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో ర్యాలీ తీస్తున్న ఆంధ్రా యూనివర్సిటీ ఎంప్లాయీస్ యూనియన్. వీరు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

తెలుగు వారి ఆత్మ ఒక్కటే, ఐక్యత ఒక్కటే, భాష ఒక్కటే అంటూ సమైక్యాంధ్రకు మద్దతుగా జై సమైక్యాంధ్ర అంటూ ప్లకార్డులు పట్టుకున్న సమైక్యవాదులు.

అరగుండు

అరగుండు

సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో అరగుండు గీయించుకొని నిరసన తెలుపుతున్న ఓ సమైక్యవాది. ఈ సందర్భంగా విభజన వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు అంటూ ప్లకార్డు ప్రదర్శిస్తున్న దృశ్యం.

టిడిపి

టిడిపి

విశాఖ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులు.

రాజీనామా చేయాలి

రాజీనామా చేయాలి

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి, పనబాక, కిశోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణిలు వెంటనే రాజీనామా చేయాలంటూ తిరుపతిలో సమైక్యవాదుల ఆందోళన.

చదరంగం

చదరంగం

రాష్ట్రాన్ని చదరంగంలా ఆడుకుంటున్నారంటూ చిత్తూరు జిల్లా తిరుపతిలో వినూత్నంగా నిరసన తెలుపుతున్న సమైక్యవాదుల దృశ్యం.

మానవ హారం

మానవ హారం

సిడబ్ల్యూసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లా తిరుపతిలో మానవ హారం నిర్వహిస్తున్న సమైక్యవాదులు.

విద్యుత్ సౌధ

విద్యుత్ సౌధ

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా విధులకు గైర్హాజరైన విద్యుత్ ఉద్యోగులు. ప్రాంగణంలో మహిళా ఉద్యోగుల దృశ్యం.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.

తెలంగాణ

తెలంగాణ

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద పార్లమెంటులో వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యం.

ఫిర్యాదు

ఫిర్యాదు

ఎపిఎన్జీవో సభ సమయంలో విద్యార్థులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఎర్రోళ్ల శేఖర్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేస్తున్న దృశ్యం.

సచివాలయం

సచివాలయం

సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాదులోని సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+