వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల బోనస్: మైక్ కట్ చేసి జెపికి ఝలక్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ బస్సు యాత్ర శనివారం తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో కొనసాగింది. ఆమె కాకినాడ, పాయకరావుపేటలలో నిర్వహించిన సభలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు దుర్మార్గమైనవని మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ అన్నదమ్ముల్లాంటి తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టిందని, దీంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పాడెక్కగా, అభివృద్ధి పథకాలు అటకెక్కాయన్నారు.

ఓట్లు, సీట్ల కోసమే విభజించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని సూచించారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న ఎపిఎన్జీవోలు, ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. మనకు మంచి రోజులు వస్తాయని, జగన్ ముఖ్యమంత్రి అయితే ఉద్యోగుల ఒక నెల జీతాన్ని బోనస్‌గా ఇస్తామని హామీ ఇచ్చారు. షర్మిలకు సమైక్యవాదులు మద్దతు తెలుపుతున్నారు.

మరోవైపు కర్నూలులో తెలుగు తేజం పేరుతో యాత్ర ప్రారంభించిన లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు సమైక్యవాదులు షాక్ ఇచ్చారు. యాత్రకు ముందు తెలుగు తల్లి విగ్రహానికి జెపి పూలమాల వేయకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బందు తప్పని జెపి పైన సమైక్యవాదులు మండిపడ్డారు.

తెలంగాణలో బంద్ జరిగినప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన సభలో మాట్లాడుతుండగా అడ్డుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశాకే మాట్లాడాలని, ఆయన మైక్ కట్ చేశారు. ఆయన బస చేసిన ప్రాంతంలోను సమైక్యవాదులు ఆందోళనకు దిగారు.

షర్మిల యాత్ర

షర్మిల యాత్ర

సమైక్య శంఖారావం పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల చేపట్టిన బస్సు యాత్ర శనివారం తూర్పు గోదావరి జిల్లా, విశాఖ జిల్లాల్లో కొనసాగింది.

మాట్లాడుతున్న షర్మిల

మాట్లాడుతున్న షర్మిల

సమైక్య శంఖారావం బస్సు యాత్రలో శనివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

అభివాదం

అభివాదం

సమైక్య శంఖారావం బస్సు యాత్రకు శనివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో తరలి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

జన సందోహం

జన సందోహం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల సమైక్య శంఖారావ యాత్రకు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తరలి వచ్చిన జన సందోహం.

అభివాదం

అభివాదం

సమైక్య శంఖారావం బస్సు యాత్రకు శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తరలి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల.

జీతం బోనస్!

జీతం బోనస్!

సమైక్య శంఖారావ యాత్ర నిర్వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల తన యాత్రలో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులకు ఒక నెల జీతం బోనస్‌గా ఇస్తామని చెబుతున్నారు.

జెపికి సమైక్యవాదుల ఝలక్

జెపికి సమైక్యవాదుల ఝలక్

తెలుగు తేజం పేరుతో యాత్ర చేపట్టిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ప్రసంగాన్ని అడ్డుకుంటున్న సమైక్యవాదులు.

దండం పెడతా.. వినండి!

దండం పెడతా.. వినండి!

తాను మాట్లాడుతుండగా సమైక్యవాదులు అడ్డుకోవడంతో తాను చెప్పేది సావధానంగా వినాలను చెబుతున్న లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ.

బందోబస్తు

బందోబస్తు

తెలుగు తేజం పేరుతో యాత్ర చేపట్టిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ప్రసంగాన్ని సమైక్యవాదులు అడ్డుకుంటున్న సమయంలో వారు ముందుకు రాకుండా పోలీసు బందోబస్తు.

స్థానికులతో జెపి

స్థానికులతో జెపి

తెలుగు తేజం పేరుతో యాత్ర చేపట్టిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు, కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ప్రసంగాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆయన అతిథి గృహానికి వెళ్లారు. అక్కడ కూడా సమైక్యవాదులు ఆందోళనకు దిగారు.

జెపి బస్సు

జెపి బస్సు

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు విజేతలు కావాలి అంటూ తెలుగు తేజం యాత్ర చేపట్టిన లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ యాత్ర చేస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం.

English summary

 YSR Congress Party chief YS Jaganmohan Reddy's sister Sharmila slams Congress for its decision on AP division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X