హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిషేధించిన బ్రెజిల్ కరెన్సీతో నగరంలో టోకరా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బ్రెజిల్‌లో నిషేధించబడ్డ కరెన్సీని సగం దరకు నగరంలో విక్రయిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్ నగర్‌కు చెందిన విష్ణు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయాడు. నష్టాల నుండి గట్టెక్కేందుకు నగరంలోని కార్ఖానలో ఉండే ఫిరోజ్ ఖాన్‌ను అప్పు కోసం సంప్రదించాడు.

ఫిరోజ్ స్నేహితుడైన షేక్ పేట నివాస్ సర్వర్ ఖాన్‌ను కలిశారు. అప్పుల నుండి బయటపడాలంటే తన వద్ద ఉన్న బ్రెజిల్ దేశానికి చెందిన కరెన్సీ (క్రూజడోస్) ఉందని, దానిని అమ్మితే డబ్బులు వస్తాయని పథకం వేశారు.

బ్రెజిల్ కరెన్సీ

బ్రెజిల్ కరెన్సీ

బ్రెజిల్‌లో నిషేధించబడ్డ కరెన్సీని సగం దరకు నగరంలో విక్రయిస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి కథనం ప్రకారం.. మహబూబ్ నగర్‌కు చెందిన విష్ణు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయాడు. నష్టాల నుండి గట్టెక్కేందుకు నగరంలోని కార్ఖానలో ఉండే ఫిరోజ్ ఖాన్‌ను అప్పు కోసం సంప్రదించాడు.

 బ్రెజిల్ కరెన్సీ

బ్రెజిల్ కరెన్సీ

ఫిరోజ్ స్నేహితుడైన షేక్ పేట నివాస్ సర్వర్ ఖాన్‌ను కలిశారు. అప్పుల నుండి బయటపడాలంటే తన వద్ద ఉన్న బ్రెజిల్ దేశానికి చెందిన కరెన్సీ (క్రూజడోస్) ఉందని, దానిని అమ్మితే డబ్బులు వస్తాయని పథకం వేశారు. 1989లో క్రూజడోస్ కరెన్సీని బ్రెజిల్లో నిషేధించి, ప్రస్తుతం రియల్ కరెన్సీని వాడుతున్నారు. అవుట్ డేట్ కరెన్సీని అమాయకులకు తక్కువ ధరకు విక్రయించడం వల్ల అనుకున్న డబ్బులు సంపాదించవచ్చునని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని షాద్ నగర్‌కు చెందిన రామచంద్రుడు, మాసాబ్ ట్యాంకుకు చెందిన శ్రీనివాస్‌తో చెప్పి ఒక ముఠాగా ఏర్పడ్డారు.

బ్రెజిల్ కరెన్సీ

బ్రెజిల్ కరెన్సీ

బ్రెజిల్ కరెన్సీ 500 క్రూజడోస్‌కురూ.24వేలు వస్తాయని అయితే, తాము సగం ధరకే విక్రయిస్తామని దోమలగూడకు చెందిన ఓ వ్యక్తిని సంప్రదించారు. 500 బ్రెజిల్ నోట్లను 20 ఇచ్చి అతని వద్ద రూ.1.16 లక్షలు తీసుకున్నారు. ఇంకా, తమ వద్ద ఉన్న 1300 బ్రెజిల్‌కు చెందిన 500 నోట్లకు విక్రయించాలనుకున్నారు.

 బ్రెజిల్ కరెన్సీ

బ్రెజిల్ కరెన్సీ

సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ముఠా పైన నిఘా వేసింది. బేగంపేటలో ఈ ముఠా మరో అమాయకుడిని మోసం చేసేందుకు పథకం వేసిన సమాచారంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 1300 బ్రెజిల్ కరెన్సీ 500 నోట్లు.. మన కరెన్సీలో రూ.1.5 కోట్ల విలువైన నిషేధిత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను బేగంపేట పోలీసులకు అప్పగించారు.

English summary
PHOTOS OF TASK FORCE PRESS CONFERENCE IN HYDERABAD.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X