జగన్‌ను ఇలా ఆపచూశాడు: కారుతో పోటీపడి (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం తెలంగాణ సెగ తగిలింది. జగన్ తన పార్టీ నేతలతో కలిసి బొల్లారంలోని రాష్ట్రపతి విడిది భవన్‌లో ప్రణబ్ ముఖర్జీని కలిశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజనతో ఇరు ప్రాంతాలకు నష్టమని రాష్ట్రపతికి వివరించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా అఫిడవిట్‌లు ఇచ్చారు.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం వస్తున్న జగన్ కాన్వాయ్‌ని పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా, జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణవాదులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తల వాగ్వాదం జరిగింది. పోలీసులు తెలంగాణవాదులను అదుపులోకి తీసుకున్నారు.

జగన్ 1
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన నేపథ్యంలో ఎవరు అడ్డుకోకుండా ఉండేందుకు బందోబస్తు.

జగన్ 2
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం తిరిగి వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్న తెరాస కార్యకర్తలు.

జగన్ 3
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తుండగా అడ్డుకునేందుకు ఎదురుగా వెళ్తున్న ఓ తెలంగాణవాది.

జగన్ 4
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తుండగా అడ్డుకునేందుకు దాని పక్కనే పరుగెడుతున్న తెలంగాణవాది.

జగన్ 5
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తుండగా అడ్డుకునేందుకు దాని పక్కనే పరుగెడుతున్న తెలంగాణవాది. అతనిని తప్పించేందుకు ముందు వాహనం నుండి దిగిన భద్రతా సిబ్బంది.

జగన్ 6
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన అనంతరం తిరిగి వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వాహనం వెంట పరుగెత్తిన తెలంగాణవాది.

జగన్ 7
అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెంట పరుగెత్తిన తెలంగాణవాది విలేకరులతో మాట్లాడుతూ...












Click it and Unblock the Notifications