తెలంగాణలోను, కేసీఆర్ స్వభావం తెలుస్తోంది (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ హక్కుల కోసం పోరాడాల్సిందేనని తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు గద్దర్ శనివారం అన్నారు. ప్రజలు అడుగుతోంది ఉచిత ఇళ్లు కాదు తమ బతుకుకు భరోస, జీవితానికి రక్షణ అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రథమ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి తీసిన ర్యాలీ అనంతరం సభను ప్రారంభించారు.
ఉద్యమ ప్రజలందరికి సమాన హక్కులు లభించినపుడే ప్రజాస్వామ్యానికి అర్థం అని గద్దర్ అన్నారు. విద్యార్థులే రేపటి తెలంగాణ నిర్మాణానికి కీలకమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా విద్యార్థుల ఉద్యమ చరిత్రేనని అభివర్ణించారు. తెలంగాణ పోరాటయోధుల అనుభవం నుంచి నవతెలంగాణను నిర్మించుకునేందుకు కృషి చేయాలని యువతరానికి పిలుపునిచ్చారు.

టీపీఎఫ్
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ హక్కుల కోసం పోరాడాల్సిందేనని తెలంగాణ ప్రజా ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు గద్దర్ శనివారం అన్నారు. ప్రజలు అడుగుతోంది ఉచిత ఇళ్లు కాదు తమ బతుకుకు భరోస, జీవితానికి రక్షణ అని ఆయన అన్నారు.

టీపీఎఫ్
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రథమ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి తీసిన ర్యాలీ అనంతరం సభను ప్రారంభించారు.

టీపీఎఫ్
ఉద్యమ ప్రజలందరికి సమాన హక్కులు లభించినపుడే ప్రజాస్వామ్యానికి అర్థం అని గద్దర్ అన్నారు. విద్యార్థులే రేపటి తెలంగాణ నిర్మాణానికి కీలకమని అన్నారు.

టీపీఎఫ్
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా విద్యార్థుల ఉద్యమ చరిత్రేనని అభివర్ణించారు. తెలంగాణ పోరాటయోధుల అనుభవం నుంచి నవతెలంగాణను నిర్మించుకునేందుకు కృషి చేయాలని యువతరానికి పిలుపునిచ్చారు.

టీపీఎఫ్
తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏర్పరుచుకునే మిత్రత్వాన్ని బట్టి ఆయన నైజం తెలుస్తుందన్నారు.

టీపీఎఫ్
ఆదివాసీలను బలిచేసి తెలంగాణ ఇవ్వాలని మేం అడిగామా....? వారి జీవితాల్ని, హక్కుల్ని కాలరాసే హక్కు ఈ నాయకులకు ఎవరిచ్చారు. పార్టీలకతీతంగా నాయకులంతా కుమ్మక్కై పోలవరం పేరుతో వారి జీవితాలను నీటిపాలు చేశారని విరసం నేత వరవరరావు అన్నారు.

టీపీఎఫ్
పోలవరం ఆర్డినెన్స్ తేవడం వల్ల రాజ్యాంగంలోని కేవలం 3వ అధికరణాన్నే కాక రాజ్యాంగాన్నే అతిక్రమిస్తున్నారని వరవర రావు ఆరోపించారు.

టీపీఎఫ్
ఆదివాసుల జీవితాల్ని కాపాడేంతవరకు తమ పోరాటం ఆగదని, గవర్నర్‌కు అధికారాలివ్వడం, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడం వెనకు కుట్రలున్నాయన్నారు.

టీపీఎఫ్
ఏళ్ల తరబడి తెలంగాణ ప్రజలను పీడించిన ఆంధ్రులు చేసిన చట్టాలను తెలంగాణలో ఏవిధంగా అమలు చేస్తారని వరవర రావుప్రశ్నించారు.

టీపీఎఫ్
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ప్రజలు ఇటు భుక్తి కోసం, అటు విముక్తి కోసం రెండు రకాల పోరాటాలు చేయాల్సి వస్తుందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు పౌరహక్కుల న్యాయవాది సుధా భరద్వాజ్ అన్నారు.

టీపీఎఫ్
అభివృద్ధి పేరిట వినాశనం సృష్టిస్తున్నారని విమర్శించారు. వనరుల దోపిడితో ఆదివాసులను నిరాశ్రయులను చేస్తున్నారని సుధా భరద్వాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

టీపీఎఫ్
ప్రభుత్వాలు చట్టాలను తమ ఇష్టానుసారంగా వాడుకుంటున్నాయని వాటిని కాపాడడానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సుధా భరద్వాజ్ అన్నారు.

టీపీఎఫ్
జార్ఖండ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అభివృద్ధి పేరిట వనరులను దోపిడి చేస్తున్నారని జార్ఖండ్ లిబరేషన్ ఫోరం ప్రతినిధి దామోదర్ తురి అన్నారు.

టీపీఎఫ్
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజలను మోసం చేయడానికే ప్రయత్నిస్తున్నాయని విదర్భరాజ్ ఆందోళన్ సమితి ప్రతినిధి కందేవాలే ఆరోపించారు.












Click it and Unblock the Notifications