హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నరేంద్ర మోడీ మార్చేశారు!, వెళ్తా: అసదుద్దీన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముస్లీంలు రాజకీయంగా సాధికారత సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాజకీయ పార్టీలు ముస్లీంలను ఓటు బ్యాంకుగా భావించి, వారిని ఆకర్షించేందుకు తాయిలాలు ఇస్తున్నాయని, ఆ భావజాలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సమూలంగా దెబ్బతీశారని, మతపరంగా ఓట్లు రావని రుజువు చేసినందుకు నిజంగా అభినందనీయుడని, ముందు తాను భారతీయుడినని, ఆ తర్వాతే ముస్లీంను అని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ మంగళవారం మీట్ ది ప్రెస్‌లో అన్నారు.

మీరు ఎక్కిన గులాబీ రంగు కారు ఎలా ఉందని విలేకరులు ప్రశ్నిస్తే.. గులాబీ కారు డ్రైవింగ్‌ సీటులో తానే కూర్చున్నానని, స్టీరింగ్‌ నా చేతిలోనే ఉందని, బ్రేకులు కూడా నా చేతిలోనే ఉన్నాయని, కారులో ఉన్నవారిని క్షేమంగా తీసుకెళ్లడమే ముఖ్యమని చమత్కరించారు. మంగళవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ యూనియన్‌ వర్కింగ్‌ జర్నలిస్టు (టీయూడబ్ల్యుజే) నేతలు విరాహత్‌ అలీ, ఈశ్వర్‌రెడ్డి, మాజీద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు.

మహారాష్ట్రలో తాము రెండు అసెంబ్లీ స్థానాలు గెలవగానే ఆకాశం ఊడిపడ్డట్టు ఎంఐఎంకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని, ఇది పద్ధతి కాదన్నారు. మహారాష్ట్ర స్ఫూర్తితో ఎంఐఎంను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నామని, కర్ణాటక, బెంగాల్‌, యూపీలలో కూడా తాము పోటీ చేస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న ఢిల్లీ, జార్ఖండ్‌ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ముస్లింలను వేర్పాటువాదులుగా అవమానపరుస్తున్నారని, ప్రతి ముస్లిం భారతీయుడేనని స్పష్టం చేశారు.

అసదుద్దీన్

అసదుద్దీన్

సంఘ్‌ పరివార్‌ మత ఘర్షణల వల్ల దేశంలోని ముస్లిం యువత భయాందోళనలకు గరువుతోందనీ, జైభీమ్‌, జైమీమ్‌ అన్న నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల అండతో దాడులకు వ్యతిరేకంగా, ముస్లింల అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని చెప్పారు.

 అసదుద్దీన్

అసదుద్దీన్

తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు అఖిలపక్షం వెళ్లితే తామూ పాల్గొంటామని ప్రకటించారు. పాతబస్తీని ఇస్తాంబుల్‌ వలే అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు.

 అసదుద్దీన్

అసదుద్దీన్

హైకోర్టును మాత్రం అదే ప్రాంతంలో ఉంచాలని కోరారు. మెట్రోరైల్‌కు తాము వ్యతిరేకం కాదని, అయితే దారుషిఫా రూట్‌లో వివిధ మతకట్టడాలు ఉన్నాయని, బహదూర్‌పురా, కాలపత్తార్‌ వైపు మెట్రో రూట్‌ను మళ్లించాలని సూచించారు.

 అసదుద్దీన్

అసదుద్దీన్

ప్రసారభారతి చైర్మన్‌ సూర్యప్రకాశ్‌ను నిబంధనలకు విరుద్ధంగా నియమించారని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ ఎంపీ అసద్ అన్నారు.

English summary
MIM president Asaduddin Owaisi on Tuesday said the 2014 elections has broken the myth of the so-called Muslim votebank. He said that it was the figment of imagination. There was never a Muslim votebank; it was always a majority vote. Political parties exploited the voters in the name of it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X