తదేకంగా చూస్తూ జగన్, వెనుక లక్ష్మీపార్వతి (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం నాలుగో రోజుకు చేరుకుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని హైదరాబాదులోని లోటస్ పాండులో జగన్ దీక్ష చేస్తున్నారు.
నాలుగు రోజులుగా ఆయన ఆహారం తీసుకోకపోవడంతో కాస్త నీరసపడినట్లు వైద్యులు చెప్పారు. ఫ్లూయిడ్స్ ఎక్కించాలని డాక్టర్లు సూచించగా జగన్ అందుకు తిరస్కరించారు. వైద్యులు సోమవారం రాత్రి ఆయనకు పరీక్షలు నిర్వహించారు. జగన్ కొంత నీరసంగా ఉన్నారని, స్వల్పంగా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు.
జగన్ రక్తపోటు 130/90, పల్స్ రేటు 60, రక్తంలో చక్కెర 68 ఎంజి, మూత్రంలో కీటోన్ బాడీస్ నెగటివ్‌గా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని ఉస్మానియా వైద్యులు తెలిపారు. మరోవైపు జగన్‌ను చూసేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు.

జగన్ 1
అమరణ దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపేందుకు వచ్చిన ఓ అమ్మ మాట వినేందుకు చెవులు రిక్కరించిన దృశ్యం.

జగన్ 2
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష నేపథ్యంలో హైదరాబాదులోని లోటస్ పాండుకు భారీ ఎత్తున చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు.

జగన్ 3
సమైక్యాంధ్ర కోసం దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సంఘీభావం.

జగన్ 4
ఆమరణ దీక్ష సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో సరదాగా మాట్లాడుతూ గడిపారు.

జగన్ 5
తన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన వారికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నమస్కరిస్తూ...

జగన్ 6
లోటస్ పాండులో దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కడప ఎంపి అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తదేకంగా చూస్తున్న దృశ్యం.

జగన్ 7
తన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన వారికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నమస్కరిస్తూ..., పక్కన శోభా నాగి రెడ్డి తదితరులు.

జగన్ 8
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులో దీక్ష చేస్తూ నమస్కరిస్తున్న దృశ్యం.

జగన్ 9
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులో దీక్ష చేస్తూ నమస్కరిస్తున్న దృశ్యం. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన లక్ష్మీ పార్వతి.












Click it and Unblock the Notifications