నమ్మితే..: జైట్లీని కలిసి బాబును ఏకేసిన జగన్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: హుధుద్ తుఫాను బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తక్షణం విడుదల చేయాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పలువురు ఆ పార్టీ నేతలు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీని కలిసి విజ్ఞప్తి చేశారు.
తుఫాను వల్ల ఉత్తరాంధ్రలో భారీ నష్టం సంభవించిందని అరుణ్ జైట్లీకి జగన్ తెలిపారు. బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పారు.
మధ్యంతర సాయంగా కేంద్రం ప్రకటించిన రూ.1000 కోట్లను పూర్తిగా విడుదల చేయాలన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ హామీలు నమ్మిన రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు కట్టక పోవడంతో ఇప్పుడు డిఫాల్టర్లుగా (ఎగవేతదారులు) మారి బ్యాంకుల్లో రుణాలు పొందలేకపోతుననారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్, జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీతో ఆయన నివాసంలో భేటీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.

జగన్, జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీతో ఆయన నివాసంలో భేటీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఇతర నేతలు.

జగన్, జైట్లీ
కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీతో ఆయన నివాసంలో భేటీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకు నేతలను పరిచయం చేస్తూ...

జగన్
తమ విజ్ఞప్తికి అరుణ్ జైట్లీ సానుకూలంగా స్పదించారని, సాయం అందించి రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications