రైలు ప్రమాద బోగీని పరిశీలించి, ఫైర్ఐన జగన్ (పిక్చర్స్)
అనంతపురం: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 26 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
రైలు ప్రమాద స్థలానికి వచ్చిన జగన్ విలేకరులతో మాట్లాడారు. పద్నాలుగు నెలల్లోనే మూడు రైలు ప్రమాదాలు జరిగినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదన్నారు. ప్రమాదం తరువాత విచారణ పేరుతో చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.
రైలు ప్రమాదాలు, వోల్వో బస్సు ప్రమాదాలు జరిగిన తర్వాత కమీషన్లు వేస్తున్నారు గానీ ఫలితం ఉండడం లేదని జగన్ ధ్వజమెత్తారు. నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రైస్ ప్రమాదానికి గురైన స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం పుట్టపర్తి రైల్వే స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

జగన్ 1
పదహారు నెలల వ్యవధిలో మూడు రైలు ప్రమాదాలు జరిగాయని, అనేక మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారని, పలువురు గాయపడ్డారని, ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం విచారణకు కమీషన్లను వేస్తోందని, అయినా ఫలితం కనిపించడం లేదని జగన్ అన్నారు.

ప్రమాద స్థలి వద్ద
విచారణ నివేదికలు లేవని, ప్రమాదాలు ఎలా జరిగాయో తెలియదని, వివరాలు వెల్లడించరని, మళ్లీ ఈ రోజు కూడా కమిషన్ వేస్తామంటున్నారని, సమస్య మళ్లీ తలెత్తకుండా ఏ విధమైన చర్యులూ తీసుకోవడం లేదని జగన్ ధ్వజమెత్తారు. రైలు బోగీని పరిశీలిస్తున్న జగన్

జగన్ 2
రైళ్లకు పాతబోగీలు వాడుతున్నారని, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

జగన్ 3
నాలుగు వోల్వో బస్సు ప్రమాదాలు జరిగాయని, నడిరోడ్డుపై నాలుగు వోల్వో బస్సులు దగ్ఘమయ్యాయని, అనేక మంది చనిపోయారని, ప్రమాదాలకు కారణాలు మాత్రం తెలియడం లేదని జగన్ అన్నారు.

ప్రమాదం
అనంతపురం జిల్లాలో ప్రమాదానికి గురైన నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రైస్ రైలులో మృతి చెందిన వారి వివరాలు నమోదు చేస్తున్న పోలీసులు.

జగన్ 4
ఇన్ని బస్సు, రైలు ప్రమాదాలు జరిగి ఇంత మంది చనిపోతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని వైయస్ జగన్ ప్రశ్నించారు.

జగన్ 5
ఐదు లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటే సరిపోదని, ప్రజలకు భద్రత కల్పించడం ముఖ్యమని జగన్ అన్నారు. రైలు బోగీని పరిశీలిస్తున్న జగన్.

జగన్ 6
నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రైస్ ప్రమాదానికి గురైన స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించిన జగన్ అనంతరం పుట్టపర్తి రైల్వే స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు.

దత్తాత్రేయ
అనంతపురం జిల్లాలో ప్రమాదానికి గురైన నాందేడ్ - బెంగళూర్ ఎక్స్‌ప్రైస్ రైలును పరిశీలిస్తున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ.












Click it and Unblock the Notifications