vastu tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు ఉండొచ్చా?

ఆధునిక జీవనశైలి, అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగిన ఈ రోజుల్లో ఇళ్లను, కార్యాలయాలను అందంగా తీర్చిదిద్దడానికి చాలామంది ఆర్టిఫిషియల్ మొక్కలను ఎంచుకుంటున్నారు. నీళ్లు పోయాల్సిన పని లేకపోవడం, ఎండ-నీడతో పనిలేకుండా ఎల్లప్పుడూ పచ్చగా కనిపించడం వల్ల వీటి వైపు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. అయితే, "వాస్తు ప్రకారం ఇంట్లో ప్లాస్టిక్ లేదా కృత్రిమ మొక్కలు పెట్టడం శ్రేయస్కరమేనా? ఇవి ప్రతికూల శక్తిని ఇస్తాయా?" అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ అంశంపై వాస్తు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Vastu tips According to Vastu can artificial plants be kept in the house

జీవకళ vs నాచురల్ లుక్

భారతీయ సంప్రదాయ వాస్తు శాస్త్రంలో ప్రకృతికి, జీవకళ ఉన్న వస్తువులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. తులసి, మనీప్లాంట్, వెదురు, అలోవెరా వంటివి ఇంట్లో ఉంటే గాలి శుద్ధి అవ్వడమే కాకుండా, పరిసరాల్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇవి ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని నింపుతాయి. కృత్రిమ మొక్కలు చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వీటిలో 'జీవం' ఉండదు. ఆక్సిజన్‌ను అందించడం కానీ, వాతావరణాన్ని శుద్ధి చేయడం కానీ వీటి వల్ల కాదు. కాబట్టి సహజ మొక్కలు ఇచ్చే స్థాయి ప్రాణశక్తిని ఇవి అందించలేవని వాస్తు సూచిస్తుంది.

vastu tips: ఏ రాశివారికి ఏ దిక్కున ఉండే ఇళ్లు వాస్తుపరంగా కలిసి వస్తాయి?
vastu tips: ఏ రాశివారికి ఏ దిక్కున ఉండే ఇళ్లు వాస్తుపరంగా కలిసి వస్తాయి?

కృత్రిమ మొక్కలు వాస్తు ప్రకారం దోషమా?

వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో కృత్రిమ మొక్కలు ఉంచడం పూర్తిగా నిషేధమేమీ కాదు. ఇవి వాస్తు దోషాన్ని కలిగిస్తాయని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్‌పై దుమ్ము పేరుకుపోతే మాత్రం అది ప్రతికూలతకు దారితీస్తుంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. రంగు వెలిసిపోయినా, ఆకులు ఊడిపోయినా లేదా విరిగిపోయినా ఆ మొక్కలను వెంటనే ఇంట్లోంచి తొలగించాలి. పాడైన వస్తువులు మానసిక నిరాశను, ప్రతికూల భావనలను కలిగిస్తాయి.

vastu tips: ఇంటికి వేసే రంగులకు వాస్తు.. ప్రధానంగా ఉత్తర గోడకు!
vastu tips: ఇంటికి వేసే రంగులకు వాస్తు.. ప్రధానంగా ఉత్తర గోడకు!

ఏ ప్రదేశాల్లో పెట్టవచ్చు? ఎక్కడ పెట్టకూడదు?

లివింగ్ రూమ్, రిసెప్షన్, విజిటర్స్ ఏరియా లేదా ఆఫీస్ డెస్క్‌పై అలంకరణ సాధనంగా వీటిని ఉంచుకోవచ్చు. పూజా మందిరం, తులసి కోట పరిసరాలు లేదా అత్యంత పవిత్రంగా భావించే స్థలాల్లో ఆర్టిఫిషియల్ మొక్కలను ఉంచకూడదు. అక్కడ కేవలం సహజమైన, నిజమైన మొక్కలకే ప్రాధాన్యం ఇవ్వాలి.

నిపుణుల సూచనలు

ఇంట్లో కేవలం కృత్రిమ మొక్కలపైనే ఆధారపడకుండా, అలంకరణకు ఆర్టిఫిషియల్ వాడినా కనీసం ఒకటి లేదా రెండు సహజ మొక్కలను (తులసి, మనీప్లాంట్ మొదలైనవి) కూడా పెంచడం మంచిది. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వల్ల నేరుగా అశుభం ఏమీ జరగదు. వాటిని శుభ్రంగా, అందంగా నిర్వహిస్తే డెకరేషన్‌గా ఉపయోగపడతాయి. అయితే ప్రకృతి ఇచ్చే ఆహ్లాదం, ప్రాణశక్తి సహజ మొక్కలతోనే సాధ్యమవుతాయని గుర్తుంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+