లక్షకోట్లు ఉంటే: గుడిలో జగన్ ఇలా (పిక్చర్స్)

శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

ఆయన ఉదయం ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లిలోని సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తుపాను బాధితులను పరామర్శించారు.

ఎనిమిది రోజులుగా జగన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.

 జగన్

జగన్

తుఫాను నష్టం లెక్కలు సరిగా వేయలేదని బాధితులు చెబుతున్నారని వైయస్ జగన్ అన్నారు. అసలు తుఫాను సాయమే అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

 జగన్

జగన్

ప్రభుత్వం ఆర్భాటం చేయడమే తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ జరగడం లేదన్నారు. ప్రభుత్వం చివరకు బియ్యం కూడా సరిగా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు.

 జగన్

జగన్

రుణాలు మాఫీ చేస్తాన్న ఆశతో రైతులు ఎవరు కూడా రుణాలు కట్టలేదని, తీరా ఇప్పుడు మాత్రం రుణాలు మాఫీ కాక, అటు పంట బీమా కూడా దక్కక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

 జగన్

జగన్

గ్రామాల్లో తాగునీటి సమస్య బాగా ఉందని, విద్యుత్ లేకపోవడంతో తాగునీటి పథకాలు పని చేయడం లేదన్నారు. ఎన్నికలప్పుడు డ్వాక్రా, రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పారన్నారు.

 జగన్

జగన్

వాస్తవానికి లక్ష కోట్ల వరకు అప్పులు మాఫీ చేయాల్సి ఉంటే, ఇప్పుడు కేవలం ఐదువేల కోట్లే ఇస్తామంటున్నారని జగన్ విమర్శించారు.

 జగన్

జగన్

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ యూ.కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించి 17 మంది మరణించిన సంఘటన పైన జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శిస్తానని చెప్పారు.

 జగన్

జగన్

శ్రీకాకుళం జిల్లాలోని హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధితుల కష్టాలు చూసి చలించిపోయారు.

 జగన్

జగన్

బాధితులకు ప్రభుత్వం తగిన సాయం అందించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 జగన్

జగన్

పైబర్ బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు రూ.2లక్షల యాభై వేలు, వలలు కోల్పోయిన వారికి రూ.50వేలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 జగన్

జగన్

కొబ్బరితోటలు కోల్పోయిన వారికి చెట్టుకు రూ.5వేలు, జీడిమామిటి తోట ఎకరాకు రూ.50వేలు, కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.

 జగన్

జగన్

ప్రతి బాధితుడికి తక్షణ సాయంగా ఇంటింటికి రూ.5వేలు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

 జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో హుధుద్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+