Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శోభ భర్త, పిల్లలు కన్నీరు: ఆపుకోలేక షర్మిల (పిక్చర్స్)

కర్నూలు: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డికి ప్రజలు కన్నీటితో శుక్రవారం అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆళ్లగడ్డలో జరిగాయి.

ఆళ్లగడ్డలోని శోభ ఇంటి వద్దకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి తమ నాయకురాలిని కడసారి దర్శించుకుని నివాళులర్పించారు. భౌతికకాయం వద్ద భర్త నాగిరెడ్డి, కుమార్తెలు అఖిల ప్రియ, మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. అది అందర్నీ కలచివేసింది. వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు.

ఎప్పుడూ గంభీరంగా ఉండే నాగిరెడ్డి సైతం తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. శోభ తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి, సోదరుడు ఎస్వీ మోహనరెడ్డి వౌనంగా రోదించడాన్ని చూసిన ప్రజలు సైతం కంటతడి పెట్టారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

నివాళులర్పించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు తరలివచ్చింది.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

జగన్ వెంట ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఇతర బంధువులు శోభా నాగిరెడ్డి భౌతికకాయంపై పూలు చల్లి నివాళులర్పించారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

నాగిరెడ్డి, ఎస్వీ మోహనరెడ్డిని హత్తుకుని జగన్ కంటతడి పెట్టారు. శోభా కుమార్తెలు, కుమారుడిని దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పారు. విజయమ్మ, భారతి, షర్మిల కూడా వారిని ఓదార్చారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. పట్టణానికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న ఎస్వీ కుటుంబీకుల సొంత వ్యవసాయ క్షేత్రం వరకూ సాగిన అంతిమయాత్రలో అనుచరులు, పార్టీ కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

సంప్రదాయబద్దంగా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పోలీసులు గౌరవ వందనం చేసి గాలిలోకి మూడు సార్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

శోభ కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి చితికి నిప్పంటించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోభమ్మ అమర్ హై అంటూ నినాదాలు చేశారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

నిత్యం జనం నోళ్లలో నానే శోభా నాగిరెడ్డి ఇక లేదంటూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె అంతిమయాత్రకు భారీగా జనం తరలివచ్చారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

జనం రోదనలతో పట్టణమంతా విషాదాన్ని అలుముకుంది. శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం వేలాదిమంది అశ్రునయనాల మధ్య జరిగాయి.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె నియోజకవర్గాలనుంచే గాకుండా కడప, అనంతపురం జిల్లాలనుంచి కూడా రాజకీయాలకతీతంగా శోభా నాగిరెడ్డి చివరిచూపునకు ఉప్పెనలా కదలి వచ్చారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

ప్రతినిత్యం కార్యకర్తలతో మమేకమై నట్టింట్లో కూర్చొని సమీక్షలు నిర్వహించే శోభను నిశ్చలస్థితిలో చూసిన ప్రతి ఒక్కరూ విషాదాన్ని వెలిబుచ్చారు. ప్రత్యేకంగా అలంకరించింన లారీలో అంతిమయాత్ర సాగింది.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

ఆమె స్వగృహం నుంచి టిబి రోడ్డు మీదుగా పట్టణ సమీపంలోని చిన్నకందుకూరు రహదారిలో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి భౌతికకాయాన్ని తరలించారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపగానే కుమారుడు జగత్ విఖ్యాత రెడ్డి చితికి నిప్పటించారు. ఆళ్లగడ్డలో వ్యాపారులు రెండోరోజూ దుకాణాలు స్వచ్ఛందంగా మూసేశారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి మృతితో ఆమె భర్త భూమా నాగిరెడ్డి బోరున విలపించారు. ఇద్దరు కుమార్తెలు అఖిల ప్రియ, మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత రెడ్డితో కలిసి శోభ భౌతికకాయం వద్దే కన్నీరుమున్నీరయ్యారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

భూమాకు సన్నిహితులు ఎవి సుబ్బారెడ్డి, శోభ అన్న ఎస్వీ సుబ్బారెడ్డి, సమీప బంధులను చూసినప్పుడల్లా భూమా కన్నీటిని ఆపుకోలేకపోయారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

అదే సమయంలో శోభా నాగిరెడ్డి తండ్రి, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి భూమా ఇంటివద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

శోభ అంత్యక్రియలకు హాజరైన వైయస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్, విజయమ్మ, షర్మిల, భారతిలు కన్నీటిపర్యంతమయ్యారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డికి ప్రజలు కన్నీటితో శుక్రవారం అంతిమ వీడ్కోలు పలికారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆళ్లగడ్డలో జరిగాయి. ఆళ్లగడ్డలోని శోభ ఇంటి వద్దకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి తమ నాయకురాలిని కడసారి దర్శించుకుని నివాళులర్పించారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

భౌతికకాయం వద్ద భర్త నాగిరెడ్డి, కుమార్తెలు అఖిల ప్రియ, మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. అది అందర్నీ కలచివేసింది. వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

ఎప్పుడూ గంభీరంగా ఉండే నాగిరెడ్డి సైతం తన భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. శోభ తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి, సోదరుడు ఎస్వీ మోహనరెడ్డి వౌనంగా రోదించడాన్ని చూసిన ప్రజలు సైతం కంటతడి పెట్టారు.

శోభా నాగిరెడ్డి

శోభా నాగిరెడ్డి

రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు శోభా నాగిరెడ్డికి ప్రజలు కన్నీటితో శుక్రవారం అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆళ్లగడ్డలో జరిగాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+