వైయస్ విగ్రహం తొలగింపు: జగన్‌కు ఆదరణతో చంద్రబాబు కక్ష (పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కక్ష కట్టారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. టిడిపికి పోయేకాలం వచ్చిందన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను ఆ పార్టీ అవలంభిస్తోందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిడిపి నేతలు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమన్నారు. పథకం ప్రకారం మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు.

తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో చంద్రబాబులో గుబులు పుడుతోందన్నారు. తాము చేపట్టిన గడప గడపకూ వైయస్సార్ కార్యక్రమంలో భాగంగా, చంద్రబాబు సర్కారుపై ప్రజలు ఏ మేరకు కోపంగా ఉన్నారన్న విషయం వెల్లడవుతోందన్నారు.

వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ విగ్రహం తొలగింపు

కృష్ణ పుష్కరాల అభివృద్ది పనుల నిమిత్తం 40 హిందూ దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా విగ్రహాలపై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అర్థరాత్రి కంట్రోల్ రూంకు దగ్గరలో ఉన్న దివంగత సీఎం వైయస్ విగ్రహాన్ని అధికారులు తొలగించి వేశారు.

వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ విగ్రహం తొలగింపు

అప్పట్లో వైయస్ చేపట్టిన జలయజ్ఞానికి ప్రశంసపూర్వకంగా 2009లో బెజవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పోలవరం డిజైన్ పైన ఏర్పాటు చేసిన ఈ భారీ వైయస్ విగ్రహాన్ని రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు తొలగించేశారు.

 వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ విగ్రహం తొలగింపు

భారీ ప్రొక్లెయినర్స, క్రెయిన్ల సహాయంతో విగ్రహాన్ని కూల్చివేశారు. విగ్రహా కూల్చివేత విషయం వైసీపీ కార్యకర్తలకు తెలియడంతో.. పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగవీటి రాధా, జోగి రమేష్ సహా పలువురు కార్యకర్తలు కూల్చివేతను అడ్డుకోవడానికి వెళ్లారు. అయితే కార్యకర్తలను వారించిన పోలీసులు అందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ విగ్రహం తొలగింపు

ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే విగ్రహాన్ని కూల్చివేయడంపై వైసీపీ నేతలు భగ్గమంటున్నారు. అటు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన లగడపాటికి కూడా ప్రభుత్వం ఎలాంటి నోటీసులు పంపించలేదని తెలుస్తోంది.

 వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ ప్రతిష్టను చూసి ఓర్వలేకే సీఎం చంద్రబాబు ఇలా రాత్రికే రాత్రి విగ్రహాన్ని కూల్చి వేయించారని విమర్శించారు వైసీపీ నేతలు. రోడ్డుకు అడ్డుగా ఉన్న విగ్రహాలను తొలగించకుండా వైఎస్ విగ్రహాన్నే ఎందుకు కూల్చివేశారని, ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.

వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ విగ్రహం తొలగింపు, వైసిపి నేతల మండిపాటు పైన చంద్రబాబు కూడా స్పందించారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మరోచోటికి తరలించడంపై కాంగ్రెస్‌, వైసిపిలు శనివారం ఆందోళన నిర్వహించారు. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడారు.

వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ విగ్రహం తొలగింపు

రహదారులను ప్రధానంగా నడిచేందుకు కాకుండా విగ్రహాలను పెట్టేందుకు వినియోగించడం బాధాకరమని, మనం ఎటుపోతున్నామో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైయస్ విగ్రహం తొలగింపు

వైయస్ విగ్రహం తొలగింపు

గౌరవం ఉంటే మనసులో పెట్టుకోవాలని, ప్రజలను ఇబ్బంది పెట్టేలా రహదారి మధ్యలో పెట్టడం సమంజసం కాదని చెప్పారు. వాటిని మరోచోటికి తరలిస్తామన్నా వివాదం చేయడం సరికాదన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The YSR Congress Party has condemned the removal of YS Rajasekhara Reddy’s statue in Vijayawada and demanded that the statue be re-installed immediately.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి