వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సభలో జగన్‌కు కోపమొచ్చి, వాకౌట్ ఇలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విద్యుత్తు, ఆర్టీసీ, వ్యాట్, వాటర్ వర్క్స్, మున్సిపల్ పన్నుల్లో కొత్తగా ఒక్క రూపాయి కూడా పెంచబోమని చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఉన్నాయా అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపక్ష వైయస్ నేత జగన్ సవాల్ విసిరారు.

రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసి ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

అసెంబ్లీ సమావేశాల్లో వైయస్ రాజశేఖర రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని టిడిపి ఎమ్మెల్యేలను విమర్శించారు. రైతులు బ్యాంకుల వద్దకు వెళ్ళలేని పరిస్థితి ఉందని, శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అన్నారు.

జగన్

జగన్

చంద్రబాబు సిఎం అయిన తర్వాత తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు గుండెలపై చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలని అన్నారు.

 జగన్

జగన్

అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మంచి చేస్తేవారిని గుండెల్లో పెట్టుకుంటామని ఆయన చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై జగన్ మరోసారి ధ్వజమెత్తారు.

జగన్

జగన్

కోడెల నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు సూచిస్తున్నారని, అయితే ఇప్పుడు తీర్మానం ప్రతిపాదిస్తే, ప్రజా సమస్యలు చర్చకు రాకుండాపోతాయి కాబట్టి కొంత ఓపిక పట్టి, వచ్చే సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం గురించి ఆలోచిస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

జగన్

జగన్

బడ్జెట్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత తాను మాట్లాడేందుకు అరగంట సమయం ఇవ్వాల్సిందిగా కోరినా స్పీకర్ పట్టించుకోలేదన్నారు.

 జగన్

జగన్

గతంలో ప్రధాన ప్రతిపక్ష నేతకు రెండు నుంచి రెండున్నర గంటలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

 జగన్

జగన్

ప్రభుత్వం నియంతృత్వ పోకడ పోతున్నదన్నారు. తాను మాట్లాడిన గంటా 40 నిమిషాల సమయంలో గంటా ఆరు నిమిషాలు టిడిపి సభ్యులు అంతరాయం కలిగించారని ఆయన తెలిపారు.

 జగన్

జగన్

బడ్జెట్‌పై ఆరు రోజుల పాటు చర్చ జరగాలని అసెంబ్లీ రూల్స్‌లో స్పష్టంగా ఉన్నా నాలుగు రోజులకు తగ్గించారని వైయస్ జగన్ అన్నారు.

జగన్

జగన్

టిడిపి ఎమ్మెల్యేలు తమ ప్రసంగాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. సభలో బడ్జెట్ కేటాయింపుల గురించిగానీ పంట రుణాలు, డ్వాక్రా రుణాల గురించిగానీ మాట్లాడలేదని అన్నారు.

 జగన్

జగన్

వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ సరఫరా, పెన్షన్లు, పిఆర్‌సి, నిరుద్యోగ భృతి, గృహ నిర్మాణం, ధరల స్థిరీకరణ, చేనేత కార్మికుల సంక్షేమం, రేషన్ కార్డులు, బిసి, మైనారిటీ సబ్-ప్లాన్ వంటి ఎన్నో అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు.

 జగన్

జగన్

చివరకు 15 వేల పైచిలుకు కోట్ల రూపాయల లోటు చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ విమర్శించారు.

 జగన్

జగన్

తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్ర విద్యార్థుల ఫీజుల గురించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలను నిలిపి వేయాలని ప్రభుత్వం ఎపిపిఎస్‌సికి లేఖ రాసిందని ఆయన ఆరోపించారు.

 జగన్

జగన్

బడ్జెట్‌లో కొన్ని కీలకాంశాలపై అరగంట సేపు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు జగన్ బుధవారం నాడు శాసనసభలో ప్రకటించారు.

 జగన్

జగన్

బడ్జెట్‌పై తన ఉపన్యాసాన్ని కొనసాగించే అవకాశం కల్పించాలని ఆయన స్పీకర్‌ను కోరారు. కనీసం అర్ధగంట పాటు తమకు సమయం ఇవ్వాలని జగన్మోహన్‌రెడ్డి పేర్కొనగా, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుంటూ తన ప్రసంగం తర్వాత ఏమైనా అనుమానాలుంటే విపక్ష నేత అడిగేందుకు అవకాశం ఇవ్వాలని అన్నారు.

 జగన్

జగన్

దాంతో స్పీకర్ జగన్మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వలేదు, వెంటనే తన సీట్లో నుండి లేచిన జగన్మోహన్‌రెడ్డి పార్టీ సభ్యులతో వాకౌట్ చేశారు.

 జగన్

జగన్

ఒకే ఒక విపక్ష పార్టీకి గంటన్నర పాటు మాత్రమే అవకాశం ఇచ్చి ఇక ఇవ్వబోమని అనడం దారుణమని, కనీసం ఆరురోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చేయడం సరికాదని జగన్ అన్నారు.

 జగన్

జగన్

తమ వాదనలను వినడానికి కూడా అధికార పక్షానికి ఓపిక లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని జగన్ పేర్కొన్నారు.

 జగన్

జగన్

అయితే తాము బిఎసిలో జరిగిన చర్చ అవగాహన మేరకే సభ నిర్వహణ జరుగుతోందని దానికి విపక్షం కట్టుబడి ఉండాలని అన్నారు. తాను ఎవరి హక్కులను తోసిపుచ్చడం లేదని, బిఎసిలో వచ్చిన అవగాహన మేరకే సమయాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నానన్నారు.

English summary
The YSR Congress members, led by their leader YS Jaganmohan Reddy, staged a walkout from the state Assembly on Wednesday protesting the failure of the TD government to give clarity on the quantum of money required for crop loan waiver and the date from which it will be implemented.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X