
Pic Talk: పవన్ కళ్యాణ్ తో దిల్ రాజ్ టీం భేటీ : చిరంజీవి ఫోన్ - పేర్ని నాని మీటింగ్ : అక్కడే ట్విస్ట్..!!
రిపబ్లిక్ మూవీ వేదిక నుంచి పవన్ చేసిన ప్రసంగం ఏపీ ప్రభుత్వం వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మారింది. అనేక మలుపులు తీసుకుంది. తన మీద కోపంతో సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టవద్దని.. సినీ ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. దీని పైన ఏపీ మంత్రులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుందా అని ప్రశ్నించారు. దీని పైన సినీ పెద్దలు స్పందించాలని మంత్రి పేర్ని నాని కోరారు. దీంతో..తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది.

పవన్ కు లభించని మద్దతు
పవన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని..తమకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కావాలంటూ స్పష్టం చేసింది. ఇక, వరుసగా నాగార్జున..అల్లు అరవింద్ టాంటి వారు సినీ పరిశ్రమను ఆదుకోవాలంటూ సీఎం ను జగన్ ను కోరారు. ఇదే సమయంలో పవన్ విజయవాడ టూర్ లో ఉన్న సమయంలోనే దిల్ రాజుతో పాటుగా పలువురు నిర్మాతలు మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఆ సమయంలో వీరి సమక్షంలోనే పవన్ పైన పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. అదే సమయంలో చిరంజీవి తనకు ఫోన్ చేసారని..జరిగిన పరిణామాల పైన విచారం వ్యక్తం చేసారని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా
నిర్మాతలు సైతం ఆన్ లైన్ టిక్కెట్ల విషయం తామే ప్రతిపాదించామని చెప్పారు. ప్రభుత్వం పరిష్కరించాల్సిన అంశాల పైన చర్చించామని...వ్యక్తిగత అంశాలు-రాజకీయాలతో సంబంధం లేదని మంత్రితో నిర్మాతలు స్పష్టం చేసారు. ఇక, పవన్ సైతం తన వద్దకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తేనే తాను మాట్లాడాల్సి వచ్చిందని..టిక్కెట్ ధరలు ఎంతైనా పెట్టుకోండంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు పేర్ని నానితో సమావేశమైన నిర్మాతల టీం వచ్చి పవన్ కళ్యాణ్ తో సమావేశమైంది.

ఇక వివాదం ముగించేలా
మంత్రి పేర్ని నాని తో చర్చల సమయంలో జరిగిన అంశాలు...వీరు ప్రస్తావించిన విషయాలు..మంత్రి స్పందన గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. పవన్ చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ వ్యాఖ్యలు చేయటం పైన నిర్మాతలు వివరణ ఇచ్చినట్లుగా సమాచారం. రాజకీయ వివాదాల్లోకి సినిమాలు లాగవద్దని... ఇప్పటికే ఇండస్ట్రీ నష్టాల్లో ఉందనే భావనే తాము వ్యక్తి చేసామంటూ వివరించినట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా ఎలా ఉన్నా..సినిమా పరిశ్రమ పరంగా మాత్రం ప్రభుత్వ సాయం అవసరమనే విషయాన్ని వారు పవన్ కు వివరించినట్లు తెలుస్తోంది.

సినిమా అంశాల పైన ఇక మౌనంగానే..
అయితే ,దీని పైన నిర్మాతల తో పవన్ ఏ రకంగా స్పందించారనేది తెలియాల్సి ఉంది. నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు పేర్ని నాని తో సమావేశమయ్యారు. ఈ రోజున తిరిగి పవన్ కళ్యాణ్ తోనూ వారే సమావేశమయ్యారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం వీరి సమస్యల పైప ఏ రకంగా రియాక్ట్ అవుతుంది... పరిష్కార మార్గం ఏం చూపిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.