PIC talk:దేవాన్ష్ అప్పుడే రంగంలోకి - నారావారి పల్లెలో సంథింగ్ స్పెషల్..!!
మూడేళ్ల విరామం తరువాత నారా - నందమూరి కుటుంబాలు నారావారి పల్లెకు చేరుకున్నాయి. సంక్రాంతి చంద్రబాబు స్వగ్రామంలో జరుపుకుంటున్నారు. ఎన్నికలు..వీరసింహారెడ్డి విడుదలతో అటు చంద్రబాబు..ఇటు బాలయ్య జోష్ మీద ఉన్నారు. 2019లో చివరి సారిగా ఈ రెండు కుటుంబాలు ఇక్కడే సంక్రాంతి జరుపుకున్నారు. గ్రామస్థులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఇప్పుడు తిరిగి అదే విధంగా రెండు కుటుంబాలు కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సారి ఈ రెండు కుటంబాల్లో నారా దేవాన్ష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. నారావారి పల్లెలో దేవాన్ష్ చేస్తున్న సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నారావారి పల్లెలో నేటి నుంచి సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ రోజు నారా - నందమూరి కుటుంబ సభ్యులు పాండురంగయ్యగారి పల్లెలో గ్రామస్థులతో కలిసి విందులో పాల్గొంటున్నారు. అక్కడే ప్రత్యేకంగా కార్యక్రమాలను ఖరారు చేసారు. నారావారి పల్లెలో దేవాన్ష్ సందడి ఆసక్తిగా మారింది. స్థానికంగా ఉన్న వారితో కలిసి దేవాన్ష్ పాలు పితికిన ఫొటోలు వైరల్ గా మారాయి. తొలుత చంద్రబాబు, తరువాత భువనేశ్వరి, లోకేశ్ ఇప్పుడు బ్రాహ్మణి కూడా హెరిటేజ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దేవాన్ష్ పాలు పితకటం పైన ఆసక్తి చూపించటంతో హెరిటేజ్ కు వారసుడు రెడీ అవుతున్నారంటూ సరదా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక, అటు బాలయ్య వీరసింహారెడ్డి మూవీ రిలీజ్ కావటంతో ఆ సందడిలో బిజీగా ఉన్నారు. తొలి రోజునే భారీగా ఈ సినిమా కలెక్షన్లు సాధించినట్లుగా చెబుతున్నారు. ఇటు చంద్రబాబు ఈ పండుగ మూడు రోజులు రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిగా కుటుంబ సభ్యులు..గ్రామస్థుల మధ్య సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. పండుగ పూర్తయిన తరువాత 16వ తేదీన 16వ తేదీన చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ తిరుగుపయనమవుతారు. 17న నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు పయనమవుతారు. ఈ నెల 27న కుప్పం నియోజకవర్గం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications