అమరావతికి రండి: లండన్ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు (పిక్చర్స్)

హైదరాబాద్: అమరావతిలో భారీ ఎత్తున పెట్టుబడులు, పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు ముందుకు రావాలన్న చంద్రబాబు నాయుడు పిలుపునకు లండన్ పారిశ్రామిక వేత్తలు సానుకూలంగా స్పందించారు. ఇందుకోసం తమ సంస్థల తరపున త్వరలో రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు పంపుతామని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం లండన్‌లో పర్యటిస్తోంది. లండన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక సమ్మేళనం (ఐఐపిసి)లో రాష్ట్ర బృందం పాల్గొంటోంది. అక్కడ పారిశ్రామిక వేత్తలతో పలు సమావేశాలు నిర్వహించనుంది.

ఇందుకోసం చంద్రబాబుతో పాటు పది మంది మంత్రులు, అధికారులతో కూడిన బృందం శుక్రవారం నాడు లండన్ చేరుకుంది. లండన్ చేరుకున్న బృందం తొలి రోజు తమ పర్యటనను ప్రారంభించింది. వాణిజ్య వ్యాపార వేత్తలతో భేటీ అయ్యేందుకు తూర్పు లండన్‌లోని కనరీ వార్ఫ్ ప్రాంతానికి వెళ్లింది.

లండన్ ఐను సందర్శన

లండన్ ఐను సందర్శన



లండన్ చేరుకున్న వెంటనే థేమ్స్ దక్షిణ ఒడ్డున ఉన్న ఆకర్షణీయ పర్యాటక స్థలం లండన్ ఐను ముఖ్యమంత్రి సందర్శించారు.

ఇదే తరహాలో...

ఇదే తరహాలో...

అమరావతిలోనూ లండన్ ఐ తరహా పర్యాటక ఆకర్షక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అనంతరం సిఎంతో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి ప్రతినిధులు ప్రతినిధులతో సిఎం సమావేశమయ్యారు.

లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో..

లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో..

లండన్‌లో పనిచేస్తున్న లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి పనితీరును సిఇఓ నిఖిల్ రాఠీ వివరించారు. రెండు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులతో లండన్ స్టాక్ ఎక్స్ఛేంజి 500కుపైగా కంపెనీలు నమోదయ్యాయని ఆయన చెప్పారు.

ఎపిలో మౌలిక సదుపాయాలపై...

ఎపిలో మౌలిక సదుపాయాలపై...

ఆంధ్రప్రదేశ్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మౌలిక సదుపాయాల కల్పనపై లండన్ ప్రతినిధులతో చంద్రబాబు బృందం చర్చించింది. అమరావతిలో భాగస్వామ్య అవకాశాలపై స్టాక్ ప్రతినిధులు ఆసక్తిని ప్రదర్శించారు.

సిఎం విజ్ఞప్తి..

సిఎం విజ్ఞప్తి..

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు రావాలని సిఎం వారిని కోరారు.

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు..

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు..

ముఖ్యంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేసే అంశంపై ప్రతిపాదలతో రావాలని కోరగా అమరావతి నిధుల సమీకరణలో సహాయం అందించడానికి లండన్ స్టాక్ ఎక్స్చేంజి ప్రతినిధులు అంగీకరించారు.

సమావేశానికి హాజరు..

సమావేశానికి హాజరు..

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌గా లండన్‌లో అభివృద్ధి చెందిన ద్వీపకల్పం కేనరీ వార్ఫ్ లో జరిగే సమావేశానికి హాజరయ్యారు. అంతకు ముందు సిఎం మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు.

వార్స్ సభకు హాజరు...

వార్స్ సభకు హాజరు...

యుకెలో అగ్రగామి 20 సంస్థల ప్రతినిధులు వార్ఫ్ సభకు హాజరయ్యారు. గ్రేటర్ లండన్ అథారిటీ, ఆర్‌ఐసిఎస్, ఐకామ్, బెనాయ్, అరూప్, మోట్‌మ్యాక్ డోనాల్డ్, కెటాపల్ట్, స్టడీవ్ ఎరీనా, వోడాఫోన్, రోల్స్ రోయిస్, హెర్బెర్ట్, స్మిత్‌ఫ్రీ హిల్స్, జెసిబి, ఎఆర్‌ఎం, మెస్, గ్లీడ్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

అమరావతి రండి...

అమరావతి రండి...

అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సిఎం వారిని కోరారు. అమరావతిలో పెట్టుబడులకు లండన్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరిచారు.

లండన్ పర్యటనలో వీరు...

లండన్ పర్యటనలో వీరు...


చంద్రబాబు వెంట మంత్రులు డాక్టర్ పి నారాయణ, యనమల రామకృష్ణుడు, ఎన్‌ఆర్‌ఐ సలహాదారుడు డాక్టర్ రవికుమార్ పి వేమురు, సిఎం ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పెనుమాక వెంకట రమేష్ బాబు ఉన్నారు.

వీరు కూడా...

వీరు కూడా...

క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజిమెంట్ కార్పొరేషన్ చైర్మన్ డి లక్ష్మీ పార్ధసారధి, టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, సిఆర్‌డిఎ కమిషనర్ నాగులపల్లి శ్రీకాంత్, సిఎం పిఎస్ పెండ్యాల శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ అధికారి కూచిపూడి నాగేష్‌బాబు కూడా లండన్ పర్యటనలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+