విజయమ్మ విషాదం: జగన్ ఫ్యామిలీ నివాళి (పిక్చర్స్)
కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కార్యక్రమంలో జగన్‌తోపాటు ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్‌కుమార్, సోదరుడు, కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, కడప మేయర్ కె.సురేష్‌బాబు, కుటుంబ సభ్యులు విమలమ్మ, మాజీ ఎమ్మెల్యే వైఎస్ పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజల ఆశాజ్యోతి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జగన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజలు తమ పార్టీతోనే వున్నారనే వాస్తవాన్ని విస్మరించి ప్రత్యర్థులు రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు.

జగన్ కుటుంబ సభ్యులు ఇలా....
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఇడుపులపాయలోని సమాధి వద్ద వైయస్ జగన్, వైయస్ విజయమ్మ, కటుంబ సభ్యులు ఇలా నివాళులు అర్పించారు.

విషణ్నవదనురాలై విజయమ్మ..
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తూ వైయస్ విజయమ్మ విచార వదనంతో కనిపించారు.

వైయస్ విగ్రహానికి పూలమాల
తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

నాయకుల నివాళి
వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు ఇడుపులపాయకు తరలివచ్చి నివాళులు అర్పించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు.












Click it and Unblock the Notifications