శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హుధుద్: గూడు చెదిరి, గుండె పగిలి.. (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: హుధుద్ తుఫాను విశాఖపట్నం నగరాన్ని కోలుకోని దెబ్బ తీస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నష్టం కలుగజేసింది. ప్రజలు నిరాశ్రయులయ్యారు. రోడ్లు తెగిపోయాయి. ఆదివారంనాడు మొదలైన విలయం సోమవారం ఉదయం వరకు సాగి తీవ్ర విషాద వాతావరణాన్ని మిగిల్చింది.

కూడు, గూడు లేక ప్రజలు రోడ్డున పడ్డారు. విద్యుత్తు స్తంభాలు విరిగి పడ్డాయి. టెలిఫోన్ స్తంభాలు కూడా కుప్పకూలాయి. చాలా చోట్ల అంధకారం అలుముకుంది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు పునరావాస కేంద్రాల్లో తల దాచుకున్నారు.

పంటలు నష్టపోయి రైతులు దిక్కు తోచని స్థితికి చేరుకున్నారు. నిత్యావసర సరుకులకు, మంచినీళ్లకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రజలు సహాయక చర్యలతో కాస్తా ఊరట పొందారు. ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతుండడంతో ఊపిరి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పెట్టిస్తున్నారు.

తుఫాను విలయం

తుఫాను విలయం

ఉత్తరాంధ్రలో హుధుద్ తుఫాను విలయం సృష్టించింది. తీవ్రమైన ఈదురుగాలులకు చెట్లు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి.

సహాయక చర్యలు ప్రారంభం

సహాయక చర్యలు ప్రారంభం

సోమవారం నుంచి తుఫాను తాకిడి ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. రోడ్లపై కూలిన చెట్లను, ఇతరాలను తొలగించడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు.

టవర్లు కూలిపోయాయి..

టవర్లు కూలిపోయాయి..

విద్యుత్తు టవర్లు, విద్యుత్తు స్తంభాలు విరిగి పడ్డాయి. వాటిని పునరుద్ధరించే పనిలో సహాయక బృందాలు నిమగ్నమయ్యాయి.

రహదారి పునరుద్ధరణ..

రహదారి పునరుద్ధరణ..

విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై ఆటంకాలను తొలగించడంతో రవాణా ముందుకు సాగింది. ఇలా వాహనాలు...

పైకప్పులు లేచిపోయాయి..

పైకప్పులు లేచిపోయాయి..

తుఫాను తాకిడికి, ఈదురు గాలుల వేగానికి పలు కట్టడాల పైకప్పులు లేచిపోయాయి. పలు కట్టడాలు, విగ్రహాలు కూలిపోయాయి.

జలమయం ఇలా..

జలమయం ఇలా..

తుఫాను తాకిడికి విశాఖపట్నంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నివాసాలు కూలిపోయి ప్రజలు నిరాశ్రయులుగా మారారు

ఇలా కూలిన చెట్లు..

ఇలా కూలిన చెట్లు..

తుఫాను తాకిడికి, ఈదురు గాలులకు చెట్లు కుప్ప కూలాయి. మొదళ్లతో సహా లేచిపోయి రోడ్లమీద, వాహనాల మీద పడ్డాయి.

ఇలా తొలగిస్తూ...

ఇలా తొలగిస్తూ...

రోడ్లకు అడ్డంగా పడిన చెట్లను, విద్యుత్తు స్తంభాలను, ఇతర స్తంభాలను సహాయక సిబ్బంది తొలగించడం ప్రారంభించారు.

కూలిన బస్ షెల్టర్లు..

కూలిన బస్ షెల్టర్లు..

విశాఖపట్నంలోనే కాకుండా పలు ప్రాంతాల్లో తుఫాను తాకిడికి, ఈదురు గాలులకు బస్ షెల్టర్లు కుప్పకూలాయి.

ఇలా కూలాయి..

ఇలా కూలాయి..

తుఫాను విలయం చెప్పనలవి కాకుండా ఉంది. పలు నిర్మాణాలు కుప్ప కూలాయి. ఇలా వాటిని తొలగించే పనిలో పడ్డారు.

విగ్రహాలు ధ్వంసం

విగ్రహాలు ధ్వంసం

తుఫాను తాకిడికి, ఈదురు గాలులకు విగ్రహాలు కూలిపోయాయి. సముద్రంలో కలిసిపోయాయి. వరదలకు కొట్టుకుపోయాయి.

నిత్యావసర సరుకులకు ఇబ్బంది...

నిత్యావసర సరుకులకు ఇబ్బంది...

తుఫాను తాకిడికి విలవిలలాడిన ప్రజలు రోడ్డున పడ్డారు. పాల కోసం ఇతర నిత్యావసర సరుకుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు

ఇలా తీవ్ర ఇబ్బంది..

ఇలా తీవ్ర ఇబ్బంది..

తుఫాను తాకిడికి, ఈదురు గాలులకు ప్రజలు రోడ్డున పడ్డారు. ఇలా తోపుడు బండిపై తోసుకుని పోతూ కనిపించారు.

దిమ్మెరపోయిన ప్రజలు..

దిమ్మెరపోయిన ప్రజలు..

తుఫాను తాకిడికి విశాఖపట్నం గజగజలాడింది. ప్రజలు దిమ్మెరపోయి, దిక్కు తోచని స్థితిలో పడ్డారు. వారు రోడ్డున పడ్డారు.

బాధితులు ఇలా..

బాధితులు ఇలా..

నిత్యావసర సరుకుల కోసం, మంచినీళ్ల కోసం, ఆహారం కోసం ప్రజలు ఇలా రోడ్డున పడ్డారు. వారి బాధ వర్ణనాతీతంగా ఉంది.

రోడ్డు మీదే తిండి..

రోడ్డు మీదే తిండి..

ప్రజలు గూడు చెదిరి, గుండె చెదిరి రోడ్డున పడ్డారు. ఆహారం కోసం ఇలా రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీదే భోజనాలు సాగించారు.

దిక్కు తోచని స్థితిలో..

దిక్కు తోచని స్థితిలో..

తుఫాను తాకిడికి, ఆదురు గాలుల తాకిడి గూడు చెదిరిపోయింది, గుండె చెదిరిపోయింది. ఇలా రోడ్డు మీద పడ్డారు.

రోడ్డే భోజనశాల..

రోడ్డే భోజనశాల..

పిల్లలకు, పెద్దలకు రోడ్డే భోజనశాలగా మారిపోయింది. ఉన్నదాంట్లోనే పిల్లలకు పెట్టి, చెదిరిన గూడును తిరిగి నిర్మించుకునే పనిలో..

అదేమిటి ఇలా..

అదేమిటి ఇలా..

ప్రకృతి ప్రకోపానికి సాక్ష్యంగా ఈ దృశ్యాన్ని చూడవచ్చు. ఒంటి మీద దుస్తులు కూడా లేని ఓ చిన్నారి బిత్తరపోయి చూస్తోంది.

పెట్రోల్ బంకుల వద్ద...

పెట్రోల్ బంకుల వద్ద...

పెట్రోల్ బంకులు కూడా తుఫాను తాకిడికి ధ్వంసమయ్యాయి. మిగిలి ఉన్న బంకుల వద్ద ప్రజలు ఇలా బారులు తీరారు.

కూలిన చెట్ల మధ్యనే..

కూలిన చెట్ల మధ్యనే..

ప్రకృతి విలయానికి ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. నిలువ నీడ లేక రోడ్డు మీద పడ్డారు. ఇలా కూలిన చెట్ల మధ్య చెదిరిన బతుకులు...

English summary
By Monday morning, the national highway to Vijayawada was open, and the National Disaster Response Force (NDRF) continues to clear roads. Rail operations may begin today after the tracks are repaired.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X