కెవిపి కుమారుడినని: హీరో విలనయ్యాడు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో డ్రగ్ మాఫియా గుట్టు రట్టయ్యింది. 16 గ్రాముల కొకైన్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వర్ధమాన సినీ హీరో నండూరి ఉదయ్ కిరణ్ సహా ఓ నైజీరియన్ షోలాను అదుపులోకి తీసుకున్నారు.
కెవిపి కుమారుడినంటూ సినీ హీరో నండూరి ఉదయ్ కిరణ్ గతంలో ప్రజలను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా నైజీరియన్ పాత నేరస్థుడుగా పోలీసులు గుర్తించారు. ఉదయ్ కిరణ్ వద్ద నుంచి ఇ-మెయిల్ తీసుకున్న పోలీసులు ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేశారన్నదానిపై విచారణ జరుపుతున్నారు. వాళ్లకు వచ్చే ఆర్డర్స్ అన్నీ ఇ-మైల్స్, ఎస్ఎంఎస్ రూపంలో వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరెవరికి అందజేస్తున్నదీ తదితర వివరాల కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో మరికొందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.

బిజినెస్ వీసాపై...
బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చిన నైజీరియన్ రోటిమి షాలో కెహిండీ స్థానికులతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ అక్రమ వ్యాపారం ప్రారంభించాడు.

బెంగళూర్‌లో కూడా...
నైజీరియన్ హైదరాబాదులోనే కాకుండా బెంగళూర్‌లో కూడా నార్కోటిక్ డ్రగ్స్ సరఫరాకు పూనుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

తక్కువకు కొని ఎక్కువకు..
నైజీరియన్ గ్రామ్ డ్రగ్స్‌ు రూ. 1,500లకు కొన్ని కస్టమర్ అవసారాన్ని బట్టి రూ.3 వేలకు విక్రయించేవాడు.

ఉదయ్ కిరణ్‌కు విక్రయించేవాడు..
నైజీరియన్ ఉదయ్ కిరణ్ అలియాస్ బాబీతో పరిచయం ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేసేవాడని పోలీసులు చెప్పారు.

ఈ సినిమాల్లో...
ఉదయ్ కిరణ్ అలియాస్ బాబీ పరారే, రాక్షసులు, యువరాజ్యం, ఫేస్‌బుక్ వంటి చిత్రాల్లో నటించాడు. డ్రగ్స్ వ్యవహారంతో టాలీవుడ్‌కు సంబంధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

సెల్‌ఫోన్ల స్వాధీనం..
పోలీసులు నిందితుల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. గోవా కేంద్రంగా కూడా వారు డ్రగ్స్ వ్యవహారం నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పలువురిపై నిఘా...
నిందితులు ఇచ్చిన సమాచారంతో పలుపురిపై నిఘా పెట్టినట్లు టాస్క్‌ఫోర్స్ అదనపు డిసిపి లిబారెడ్డి చెప్పారు. వారి ఫోన్ కాల్స్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications