శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుఫాను విలయం: ఉత్తరాంధ్ర విలవిల (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హుధుద్ తుఫాను తాకిడికి విశాఖపట్నం రూపు మారిపోతే, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాలపై కూడా ప్రభావం చూపింది. పలు చోట్ల విధ్వంసం చోటు చేసుకుంది. రోడ్లు తెగిపోయాయి. విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

హుధుద్ తుఫాను తాకిడి నుంచి కోలుకోకముందే శ్రీకాకుళం జిల్లాను మరో ముప్పు తాకింది. తుఫాను ప్రభావంతో ఒడిషా, విజయనగరం, విశాఖల్లో కురిసిన భారీ వర్షాలు శ్రీకుళాన్ని ముంచెత్తే ప్రమాదం ఏర్పడింది. వంశధార, నాగావళి నదులు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి.

తుఫాన్‌ ధాటికి రైలు రవాణాకు అంతరాయం ఏర్పడింది. సోమవారం విశాఖకు సర్వీసులు నడవలేదు. భువనేశ్వర్‌ - విశాఖ, విశాఖ - విజయవాడ మార్గంలో కొన్నిచోట్ల ట్రాక్‌ కూడా దెబ్బతింది. దీంతో రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేపట్టారు.

దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రత్యేక రైలులో బయలు దేరి వెళ్లారు. ముంద స్తుగా రైల్వే శాఖ పునర్నిర్మాణ సామాగ్రితో కొన్ని వ్యాగన్లను సిద్ధంచేశారు. వాటినిప్పుడు పునరుద్ధరణ పనులు జరుగుతున్నచోటుకి తరలిస్తున్నారు. మంగళవారం నాటికి రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

రాజమండ్రి ఇలా..

రాజమండ్రి ఇలా..

రాజమండ్రిలో పంటలు తుఫాను తాకిడికి ఇలా ధ్వంసమయ్యాయి. పచ్చని పైర్లు తుఫానుకు తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

శ్రీకాకుళం ఇలా..

శ్రీకాకుళం ఇలా..

హుధుద్ తుఫాను శ్రీకాకుళం జిల్లాపై కూడా ప్రభావం చూపింది. తుఫాను, ఆ తర్వాత భారీ వర్షాలు శ్రీకాకుళం జిల్లాను ముంచెత్తాయి.

వరదలు ఇలా..

వరదలు ఇలా..

తుఫాను ప్రభావంతో విశాఖపట్నం, తదితర ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో, ఒడిషాలో కురిసిన భారీ వర్షాలతో శ్రీకాకుళంలో వంశధార, నాగావళి నదులు పొంగిపొర్లుతున్నాయి.

కూలిన ఇళ్లు..

కూలిన ఇళ్లు..

తుఫాను తాకిడికి శ్రీకాకుళం జిల్లాలో ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు కోతకు గురయ్యాయి. తీవ్ర నష్టం వాటిల్లింది.

కొబ్బరి తోటలు...

కొబ్బరి తోటలు...

శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి తోటలు ధ్వంసమయ్యాయి. రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. కొబ్బరి చెట్లు కుప్పకూలాయి.

విజయనగరం జిల్లాలో..

విజయనగరం జిల్లాలో..

విజయనగరం జిల్లాలో కొబ్బరి తోటలు, ఇతర పంట పొలాలు తీవ్ర విధ్వంసానికి గురయ్యాయి. విజయనగరం జిల్లాను కూడా తుఫాను కుదిపేసింది.

నీట మునిగిన పంట పొలాలు...

నీట మునిగిన పంట పొలాలు...

విజయనగరం జిల్లాలో పంట పొలాలు నీట మునిగాయి. హుధుద్ తుఫాను తాకిడికి పచ్చని పైర్లు నీటి పాలయ్యాయి.

వరద నీరు...

వరద నీరు...

విజయనగరం జిల్లాల్లో కూడా వరద నీరు పారుతోంది. పలు ప్రాంతాలు జలమయ్యాయి. గ్రామాల్లో నీరు చేరింది.

English summary
Hudhud cyclone affected normal life in Srikakula, vijayanagaram and East Godavari also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X