కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఓటు, వదినామరదళ్లు కలిసి ఇలా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వైయస్ జగన్ కుటుంబ సభ్యులే ప్రధాన నాయకులు. కడప జిల్లా పులివెందులకు చెందిన జగన్ కుటుంబ సభ్యులంతా బుధవారం ఓట్లు వేశారు. క్యూలో నిలబడి వారు ఓటేశారు. వైయస్ జగన్‌తో పాటు ఆయన తల్లి వైయస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి వైయస్ షర్మిల ఓట్లు వేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మెజారిటీ సాధిస్తుందని వైయస్ భారతి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సీమాంధ్రలో 150 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ఆమె అన్నారు. ఆమె విజయంపై ధీమాతో ఉన్నారు.

కాగా, వైయస్ షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమె విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెసు విజయంపై ఆయన భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంటుంది. వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేశారు.

వదినామరదళ్లు కలిసి..

వదినామరదళ్లు కలిసి..

వదిన వైయస్ భారతి, మరదలు వైయస్ షర్మిల తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సిరా మరకతో కూడిన చూపుడు వేళ్లను ప్రదర్శిస్తూ ఇలా కనిపించారు.

వైయస్ జగన్ ఇలా..

వైయస్ జగన్ ఇలా..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఓటు వేస్తూ ఇలా కనిపించారు. సీమాంధ్ర ఎన్నికల ఫలితాలు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

వైయస్ విజయమ్మ ఇలా..

వైయస్ విజయమ్మ ఇలా..

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి, వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మ ఓటు వేస్తూ ఇలా కనిపించారు. ఆమె విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేశారు.

మీడియాతో మాట్లాడుతూ...

మీడియాతో మాట్లాడుతూ...

ఓటు వేసిన తర్వాత వైయస్ జగన్ సతీమణి వైయస్ భారతి మీడియాతో మాట్లాడారు. తాము 150 శాసనసభా స్థానాలు గెలుస్తామని చెప్పారు.

క్యూలో షర్మిల ఇలా..

క్యూలో షర్మిల ఇలా..

తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల ఇలా క్యూలో నించున్నారు. వైయస్సార్ కాంగ్రెసు కోసం ఆమె చెమటోడ్చారు.

English summary
YSR Congress party president YS Jagan family member YS Vijayamma, YS Sharmila and YS Bharathi franchised their voting right today at Pulivendula in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X