ఏపి డిజిపి పై హైకోర్టులో కేసు : పార్క్ భూమిని ఆక్రమించారు: వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల పిల్...!
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్(ఆర్పీ ఠాకూర్) హైదరాబాద్, ప్రశాసన్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని, దాని ఆసరాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ప్రశాసన్ నగర్‌లో..
హైదరాబాద్ ప్రశాసన్‌నగర్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నామమాత్రపు ధరకు ప్లాట్లు కేటాయించిం దని రామకృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఆర్‌పీ ఠాకూర్ కూడా ప్లాట్ నంబర్ 149లో 502 చదరపు గజా ల స్థలం పొందారన్నారు. 1996లో జీహెచ్‌ఎంసీ నుంచి జీ+1కి అనుమతి పొందారని, దానికి విరుద్ధంగా జీ+3 నిర్మించా రని పేర్కొన్నారు. అయినా, ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు చర్య తీసుకోలేదని తెలిపారు.

2008లో ఆ అక్రమ నిర్మాణాన్ని క్రమబద్దీకరించుకున్నారు. 2017లో మరోసారి అక్రమ నిర్మాణాలను చేపట్టారని, ఈసారి జీహెచ్‌ఎంసీ పార్కును ఆక్రమించి మరీ ఈ నిర్మాణాలు చేస్తున్నారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒకటి నుంచి మూడో అంతస్తుకు మెటల్ ఫ్రేమ్ సాయంతో ఓ బ్రిడ్జిగా నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. దీనిపై పొరుగునే ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్.ఎస్.గోయల్ ఫిర్యాదు చేశారని పిటిషనర్ ఆళ్ల పేర్కొన్నారు.
చర్యలు తీసుకోండి..
పార్కు స్థలాన్ని ఆక్రమించుకున్న విషయంపై కూడా గోయల్ ఫిర్యాదు చేశారని, దీనిపై వాస్తవాలను తేల్చేందుకు ఠాకూర్ ఇంటి వద్దకు జీహెచ్‌ఎంసీ అధికారులు వెళ్లగా, ఠాకూర్ మనుషులు ఆ అధికారులను అడ్డుకున్నారని తెలి పారు. ఆ తరువాత ఠాకూర్ దీనిపై సివిల్ కోర్టుకెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారని, ఆ తరువాత కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసిందన్నారు. ఈ పిటిషన్‌లో ఠాకూర్ ఎక్కడా కూడా తన హోదా గురించి ప్రస్తావించలేదని తెలిపారు.
వాస్తవాలను దాచి పెట్టి ఆ పిటిషన్ దాఖలు చేశారన్నారు. పార్కు స్థలాన్ని ఆక్రమించుకుని, అనుమతులు తీసుకో కుండా నిర్మాణాలు చేపడుతున్నారని తెలిసినా కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు ఠాకూర్‌పై చర్యలు తీసుకోవడం లే దన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, ఠాకూర్ చేపడుతున్న నిర్మాణాలను కూల్చివేసేలా జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించాలని కోరారు.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications