Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరదలో తిరుమల మాడ వీధులు - కొండపైకి దారులు మూసివేత : చిక్కుకుపోయిన భక్తులు..!!

కుంపోతవాన.. వరద నీటి ప్రవాహంతో తిరుపతి- తిరుమల ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. ఊహించని విధంగా.. కొండల్లో నుంచి వర్షపు నీటితో తిరుమల వీధులు నిండిపోయాయి. వర్షం కారణంగా నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న మ్యూజియం వద్దకు కొండ ప్రాంతం నుంచి పెద్దఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ఆ వరద మొత్తం లడ్డూ కౌంటర్‌ వద్ద నుంచి నాలుగు మాడవీధుల్లోకి చేరుకుంది. దీంతో మాడవీధుల్లో పెద్దఎత్తున బురద పేరుకుపోయింది.

Recommended Video

    AP Rains అల్లకల్లోలం Tirupati Flash Floods | Chittoor | Tirumala || Oneindia Telugu

    నీట మునిగిన క్యూ లైన్లు..కార్యాలయాలు

    క్యూలైన్లలో కూడా పెద్దఎత్తున వరద నీరు చేరింది. అయితే, శ్రీవారి ఆలయం సమీపంలో నీరు త్వరగా వెళ్లిపోయే మార్గాలు ఉండడంతో అక్కడ ఈ పరిస్థితి ఏర్పడలేదు. అదే విధంగా తిరుమలలోని ఆర్జిత సేవ కార్యాలయంలోకి నీరు ప్రవహించడంతో సర్వర్లన్నీ స్తంభించిపోయాయి. అదేవిధంగా అదనపు ఈఓ ధర్మారెడ్డి క్యాంప్‌ కార్యాలయం పూర్తిగా నీటమునిగింది. మరోవైపు.. తిరుమలలోని 10 ప్రాంతాల్లో విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు. ఘాట్‌ రోడ్డు మొత్తం వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నడకదారులను శుక్రవారం కూడా మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

    ఘాట్ రోడ్డు ..బస్సులు నిలిపివేత

    ఘాట్‌ రోడ్డును ఎప్పుడు తెరిచేది తర్వాత చెబుతామని వెల్లడించింది. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కలిగి ఉండి వర్షాల కారణంగా వెళ్లలేకపోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. అలాగే, శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులకు వసతి ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించింది. తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం రెండు, మూడో సత్రాలకు వెళ్లాలని సూచించింది. వర్షంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది.

    యాత్రికులకు వసతి - భోజన సౌకర్యాలు


    ప్రధానంగా తిరుపతి నుంచి రైల్వే కోడూరు మార్గంలో వెళ్లే పలు రైళ్లు గంటకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయని తిరుపతి స్టేషన్‌ డైరెక్టర్‌ తెలిపారు. ప్రధానంగా మామండూరు, బాలపల్లి సమీపంలో రైల్వే ట్రాక్‌పై వరదనీరు ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించారు. ఆయా రైల్వేస్టేషన్లలోని ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను పెద్దఎత్తున డ్రైనేజ్‌ నీరు ముంచెత్తింది. ఇక వర్షంతో రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు మార్గాల్లో ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేయగా.. ప్రధానంగా తిరుమలకు వెళ్లే సర్వీసులను సాయంత్రం నాలుగు గంటల నుంచే నిలుపుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు.

    చంద్రబాబు నివాసం జలమయం

    భారీ వర్షానికి మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిలోని ఆయన నివాసం జలమయమైంది. విషయం తెలుసుకున్న ఆయన బంధువులు హుటాహుటిన మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపుతున్నారు. ఈ రోజు..రేపు కూడా భారీ వర్షాల హెచ్చరికలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ వర్ష ప్రభావం ఉన్న నాలుగు జిల్లాల కలెక్టర్లతో పరిస్థితి వాకబు చేస్తున్నారు. తిరుపతిలో అందుతున్న సహాయ కార్యక్రమాల పైన ఆరా తీసారు. ఎస్డీఆర్ఎఫ్ టీంలను రంగంలోకి దింపాలని.. బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+