పిన్నెల్లి రామకృష్ణ రెడ్డికి గుడ్ న్యూస్

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఊరట లభించింది.ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

అయితే పిన్నెల్లి సహా ఎమ్మెల్యే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన కోర్టు వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు ముగిసే వరకూ పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతులు విధించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ఎమ్మెల్యే ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు.

pinnelli ramakrishna reddy big relief in high court over evm smashing case

కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఆయన అజ్ఞాతం వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు విసృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకనొక దశలో ఆయన దేశం విడిపోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోరడం..తీర్పు ఆయనకు అనుకూలంగా రావడంతో ఆయనకు స్వల్ప ఊరట లభించింది. పిన్నెల్లితో పాటు జేసి అస్మిత్ రెడ్డి(టీడీపీ),చింతమనేని ప్రభాకర్ (టీడీపీ), గోపి రెడ్డి శ్రీనివాస రెడ్డి(వైసీపీ)లను కూడా జూన్ 5 వరకు అరెస్ట్ చేయద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+