నంద్యాల టిడిపి అభ్యర్థిని హత్య చేయాలని చూస్తున్నారా?: పితాని సంచలనం

నంద్యాల బహిరంగ సభలో వైసిపి అధినేత వైయస్ జగన్ చేసిన కాల్చివేత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టిడిపి నేతలు వైసిపిపై భగ్గుమంటున్నారు. తాజాగా, పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: నంద్యాల బహిరంగ సభలో వైసిపి అధినేత వైయస్ జగన్ చేసిన కాల్చివేత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టిడిపి నేతలు వైసిపిపై భగ్గుమంటున్నారు. తాజాగా, పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టిడిపి అభ్యర్థిని హత్య చేయాలని చూస్తున్నారా?: పితాని

టిడిపి అభ్యర్థిని హత్య చేయాలని చూస్తున్నారా?: పితాని

నంద్యాలలో టిడిపి అభ్యర్థిని హత్య చేయాలని చూస్తున్నారా అని వ్యాఖ్యానించారు. నంద్యాల టిడిపి అభ్యర్థిగా భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. జగన్ దగ్గర ఇంకా రూ.10వేల కోట్ల అవినీతి సొమ్ము ఉందని ఆరోపించారు. నంద్యాల సభలో జగన్ రెచ్చగొట్టేలా మాట్లాడారని మండిపడ్డారు.

Recommended Video

    Chandrababu ruling gets 100 marks in Corruption Says YSRCP Botsa Satyanarayana - Oneindia Telugu
    వైయస్సార్ 30 ఏళ్లు నిరీక్షించారు

    వైయస్సార్ 30 ఏళ్లు నిరీక్షించారు

    ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పైకి ప్రజలను ఉసిగొల్పడం దారుణం అని పితాని అన్నారు. జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ముఖ్యమంత్రి కావడం కోసం వైయస్ రాజశేఖర రెడ్డి 30 ఏళ్లు నిరీక్షించారని గుర్తు చేశారు.

    రోజా నేర్చుకోవాలి

    రోజా నేర్చుకోవాలి

    వైసిపిలో గౌరవం లేదనే కొందరు నాయకులు టిడిపిలో చేరుతున్నారని పితాని చెప్పారు. సినిమాల్లోంచి రోజా ఇంకా బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. నిత్యం విమర్శలు చేయడం, అర్థం లేని మాటలు కాకుండా ప్రజా సమస్యలపై పోరాడటం రోజా నేర్చుకోవాలని హితవు పలికారు.

    రాజకీయాలకు పనికి రారు

    రాజకీయాలకు పనికి రారు

    జగన్ లాంటి క్రిమినల్ మైండ్ ఉన్న నేతలు రాజకీయాలకు పనికి రారని ఎంపీ సిఎం రమేష్ మండిపడ్డారు. ఆయనను రాజకీయాల నుంచి తొలగించేలా ఈసీ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ఇలాంటి వారిని ప్రజలు ఏమాత్రం సహించరని చెప్పారు. సమాజానికి చీడపురుగులా తయారయ్యారన్నారు.

    మేం తలదించుకునేలా

    మేం తలదించుకునేలా

    రాజకీయాలు అంటే ఇలా కూడా మాట్లాడుతారా అని ప్రజలు ఆశ్చర్యపోయేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. ఆయన మాటలు రాజకీయ నాయకులే అవమానంగా భావించేలా ఉన్నాయన్నారు.

    పులివెందుల ప్రజలు తెలుసుకోవాలి

    పులివెందుల ప్రజలు తెలుసుకోవాలి

    నిన్ననేమో చెప్పుతో కొట్టాలని అంటాడని, ఇప్పుడేమో కాల్చమని అంటున్నాడని సిఎం రమేష్ గుర్తు చేశారు. పులివెందుల ప్రజలు జగన్ మాటలను గుర్తుంచుకొని, ఆయనను ఎందుకు ఎన్నుకున్నామా అని బాధపడాల్సిన పరిస్థితి అని అభిప్రాయపడ్డారు. జగన్ గురించి వారు తెలుసుకోవాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+