దెబ్బకు పవన్ కళ్యాణ్‌పై మంత్రి యూటర్న్, చంద్రబాబు అసహనం?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి పితాని సత్యనారాయణ తన వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్నారు.
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి పితాని సత్యనారాయణ తన వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్నారు.

జనసేన ఇంకా ఎదగలేదని చెప్పా
మంత్రి పితాని సత్యనారాయణ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. అయితే, తాను పవన్ కళ్యాణ్‌ను విమర్శించలేదని చెప్పారు. పవన్ స్థాపించిన జనసేన ఇంకా ఎదగలేదని మాత్రమే తాను చెప్పానని చెప్పారు. పార్టీ నిర్మాణం కోసం తాను సూచనలు చేశానని చెప్పారు.

పితాని ఏమన్నారంటే
గురువారం మంత్రి పితాని మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పార్టీ ఏమిటో, ఆయన జెండా కట్టిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు జెండా పట్టుకున్న కార్యకర్త, నాయకుడిని చూడలేదన్నారు. బయటకు రాకుండా సమస్యల మీద మాట్లాడుతున్నారన్నారు.

పవన్ కళ్యాణ్ ధీటుగా
పితాని సత్యనారాయణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ధీటుగా స్పందించారు. నిన్న అశోక్ గజపతి రాజు తను ఎవరో తెలియదన్నారని, ఇప్పుడు పితాని తాను ఏమిటో తెలియదంటున్నారని వెటకారంగా ట్వీట్ చేశారు.

పితాని యూటర్న్
దీంతో పితాని సత్యనారాయణ తగ్గారు. తాను పార్టీ ఎదుగుదలకు సూచనలు చేశానని చెప్పారు. కాగా, పితాని సహా టిడిపి నేతల వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌కు ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. నేతల మాటల తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి - జనసేనల మధ్య పొత్తు ఉండదని అర్థమవుతోందని అంటున్నారు.

చంద్రబాబు అసహనం?
ఇధిలా ఉండగా, పితాని సహా టిడిపి నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పైన ఆచితూచి స్పందించాలని హితవు పలికారని అంటున్నారు. అందుకే పితాని యూటర్న్ తీసుకున్నారని భావిస్తున్నారు.
-
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications