వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామా ప్రకటన: కిరణ్ రెడ్డి హావభావాలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. గవర్నర్ నరసింహన్‌ను కలిసి రాజీనామా లేఖను సమర్పించడానికి ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంతాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ముఖ్యమంత్రి పదవికి, శాసనసభా సభ్యత్వానికి మాత్రమే కాకుండా కాంగ్రెసు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన కొత్త పార్టీ పెడతారనే ప్రచారం ఇంకా సాగుతోంది. ఈ నెల 23వ తేదీన ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన నేపథ్యంలో జరిగిన వరుస సంఘటనలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోకసభలో సీమాంధ్ర మంత్రులను కొట్టారని ఆయన ఆరోపించారు. తన గుండె రక్తమోడుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యకు ఆయన ప్రతివ్యాఖ్య కూడా చేశారు.

కిరణ్ రెడ్డి ఇలా..

కిరణ్ రెడ్డి ఇలా..

ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో విభజన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుదారులు

కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుదారులు

కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుదారులు కాసు ఏరాసు ప్రతాపరెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, పితాని సత్యనారాయణ ఇలా..

తాజా మాజీ మంత్రులు ఇలా..

తాజా మాజీ మంత్రులు ఇలా..

కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తున్న తాజా మాజీ మంత్రులు టిజి వెంకటేష్, శైలజానాథ్, మహీధర్ రెడ్డి, పార్థసారథి ఇలా..

శైలజానాథ్ ఇలా..

శైలజానాథ్ ఇలా..

సమైక్యాంద్ర కోసం మొదటి నుంచీ దూకుడుగా సాగుతూ వచ్చిన తాజా మాజీ మంత్రి శైలజానాథ్ మరో తాజా మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డితో మాట్లాడుతూ ఇలా..

సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి..

సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి..

సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చరిత్ర పుటల్లో మిగిలిపోనున్నారు. తన మద్దతుదారులతో కిరణ్ కుమార్ రెడ్డి ఇలా..

పార్టీపై దాటవేత..

పార్టీపై దాటవేత..

కొత్త పార్టీ పెట్టే విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కిరణ్ కుమార్ రెడ్డి సమాధానాన్ని దాటవేశారు.

సరిగా అర్థం చేసుకోలేదు..

సరిగా అర్థం చేసుకోలేదు..

మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి - తనను సరిగా అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు

ఆవేదనతో టిజి వెంకటేష్

ఆవేదనతో టిజి వెంకటేష్

రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆవేదనకు గురైనట్లు సీమాంధ్ర తాజా మాజీ మంత్రులు కనిపించారు. టిజి వెంకటేష్ ఇతర తాజా మాజీ మంత్రులతో కలిసి ఇలా..

క్యాంప్ కార్యాలయం ఖాళీ..

క్యాంప్ కార్యాలయం ఖాళీ..

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయనున్నారు.

సిఎం క్యాంప్ కార్యాలయంలో పావురం..

సిఎం క్యాంప్ కార్యాలయంలో పావురం..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో క్యాంప్ కార్యాలయం ఖాళీగా కనిపించింది. పావురాలు మాత్రం దాహం తీర్చుకోవడానికి ఇలా వచ్చాయి

కిరణ్ రెడ్డి ప్రెస్ మీట్‌కి క్యూ

కిరణ్ రెడ్డి ప్రెస్ మీట్‌కి క్యూ

కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరు కావడానికి మీడియా ప్రతినిధులు ఇలా క్యూ కట్టారు.

మహీధర్ రెడ్డితో ఇలా..

మహీధర్ రెడ్డితో ఇలా..

కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రి వర్గంలో పనిచేసిన మహీధర్ రెడ్డితో ఇలా కనిపించారు. భావోద్వేగాన్ని ఆపుకోవడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించినట్లు కనిపించారు.

ఇలా చివరి సారి..

ఇలా చివరి సారి..

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఇలా కనిపించారు. ఆ తర్వాత ఆయన తన సొంత ఇంటికి మారే అవకాశాలున్నాయి.

అభ్యంతరాలు పట్టించుకోలేదు..

అభ్యంతరాలు పట్టించుకోలేదు..

రాష్ట్ర విభజనపై తాను వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్రం గానీ పార్టీ అధిష్టానం గానీ పట్టించుకోలేదనే ఆవేదనతో కిరణ్ కుమార్ రెడ్డి...

నమస్కారాలు..

నమస్కారాలు..

ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని చెబుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఇలా నమస్కారాలు పెట్టారు

ఇదేం తీరు..

ఇదేం తీరు..

లోకసభలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను కొట్టారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన మన్మోహన్ సింగ్‌ వ్యాఖ్యకు కౌంటర్ కూడా ఇచ్చారు.

English summary
CM Kiran kumar Reddy has resigned from his post and Congress party. He addressed a press meet before tendering resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X