ఎలాగో.. చంద్రబాబును చూసి నేర్చుకోండి!: రాష్ట్రాలకు కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల విద్యుత్ పొదుపులో ఏపీ ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకుగాను పలు అవార్డులు కూడా అందుకుంది.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ శనివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును చూడాలని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. విద్యుత్ పంపిణీ, సరఫరాల్లో నష్టాలను తగ్గించడం ఎలాగో చంద్రబాబును చూసి నేర్చుకోవాలని వ్యాఖ్యానించారంట.

ఇంధన సంస్థల ఆర్థిక పరిపుష్టి అనే అంశం పైన శనివారం నాడు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీయూష్ గోయల్... ఏపీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

Piyush Goyal praises AP government for power saving

విద్యుత్ పంపిణీ, సరఫరాల్లో నష్టాలను తగ్గించడం ఎలాగో చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని రాష్ట్రాలకు కేంద్రమంత్రి సూచించారు.

ఏపీ నుంచి హాజరైన అజయ్ జైన్ రాష్ట్రంలో ఇంధన ప్రగతి పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంధన సరఫరా, పంపిణీ నష్టాలను సింగిల్ డిజిట్‌కు తెచ్చామని తెలిపారు. దీంతో ఏపీలో ఇంధన సంస్థల నష్టాలను నివారించడంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+