ఏపీ నుంచి నిలిపివేయాల్సి వస్తుంది- కేంద్ర మంత్రి వ్యాఖ్యల కలకలం..!!
ఏపీకి సంబంధించిన బియ్యం సేకరణ పైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ వర్సస్ కేంద్రం అన్నట్లుగా సాని వ్యవహారంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ సీఐకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఏపీకి సంబంధించి కేంద్ర మంత్రి ఒక హెచ్చరిక చేసారు. ఉచిత బియ్యం పంపిణీ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచీ బియ్యం, వడ్ల సేకరణను నిలిపేయాల్సి వస్తుందని స్పష్టం చేసారు.

ఏపీలో బియ్యం సేకరణపై
ఆంధ్రప్రదేశ్‌లో పీఎంజీకేఏవై 6వ దశ కింద ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ దశ కింద 8.04 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయించాం. ఏ రాష్ట్రమైనా ఈ కేంద్ర పథకాన్ని అమలు చేయకపోతే అందుకు తగ్గ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ స్పష్టం చేసారు. ఇదే అంశం పైన పార్లమెంట్ లో టీడీపీ సభ్యుడు కేశినేని అడిగిన ప్రశ్నకు సభలో మంత్రి పీయూష్ సమాధానం ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది
ఈ పథకం కింద ఏపీకి గత అయిదు విడతల్లో 23,75,496 మెట్రిక్ టన్నులు అందించామని వెల్లడించారు. అయితే, ఏపీలో ఇప్పటి దాకా ఉచిత బియ్యం పంపిణీ చేయలని విషయాన్ని ప్రశ్నించామని.. తమ వద్ద తగిన నిల్వలు ఉన్నాయని చెబుతూ.. ప్రత్యేకంగా సమస్యలను చెబుతూ ఆలస్యమైందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆయన వెల్లడించారు. ఈ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు పీయూష్ తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతున్నాయి.

కేంద్ర మంత్రుల వరుస వ్యాఖ్యలతో
పార్లమెంట్ సమావేశాలు మొదలైన తరువాత ఒకే రోజు శ్రీలంకలో సంక్షోభం పైన అఖిలపక్ష సమావేశంలో ఏపీ ఆర్దిక వ్యవస్థ గురించి.. పోలవరం ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ.. ఇప్పుడు బియ్యం విషయంలోనూ కేంద్రం ఒక విధంగా ఏపీకి హెచ్చరిక ఇప్పుడు రాజకీయంగానూ చర్చకు కారణమవుతోంది. తెలంగాణలో ఇదే అంశంతో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్రం అన్నట్లుగా రాజకీయ యుద్దం సాగింది. ఏపీలోని పరిస్థితుల పైన కేంద్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. దీని పైన ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా కౌంటర్ ఇవ్వటం ప్రారంభించారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications