పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధుల జమ తేదీ ఖరారు: వీరికే దక్కేది, చెక్ చేసుకోండి..!!
రైతులకు బిగ్ అప్డేట్. ఎట్టకేలకు కేంద్రం- ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధుల జమ తేదీ ఖరారైంది. కేంద్రం 20వ విడత పీఎం కిసాన్ పథకం నిధుల తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదా త సుఖీభవ తొలి విడత నిధులను సమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అర్హత కలిగిన రైతులను గుర్తించింది. వారి జాబితాలను ఖరారు చేసింది. ఇక.. అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పథకం కింద రూ 2 వేలు.. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ 5 వేలు ఒకే రోజు జమ కానుంది.
ఆగస్టు 2 ముహూర్తం
కేంద్రం- ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధుల జమ తేదీ దాదాపు ఖరారైంది. కేంద్రం 20వ విడత పీఎం కిసాన్ పథకం నిధుల తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను సమ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఆగస్టు 2వ తేదీ ముహూర్తంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఆ రోజున ప్రధాన మోదీ వారణాసి పర్యటన ఉంది. గతంలోనూ వారణాసి కేంద్రంగానేగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేసారు. ఇప్పుడు అదే రోజున విడుదలకు అవకాశం కనిపిస్తోంది. ఇక.. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అర్హత కలిగిన రైతులను గుర్తించింది. వారి జాబితాల ను ఖరారు చేసింది. అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకోవటానికి ఇప్పటికే అవకాశం కల్పించిం ది. ఇక.. అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ పథకం కింద రూ 2 వేలు.. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ 5 వేలు ఒకే రోజు జమ కానుంది.

ఒకే సారి విడుదల
ఏడాదిలో మూడు సార్లు కేంద్రం పీఎం కిసాన్ కింద రూ 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఏపీ ప్రభుత్వం సైతం అదే విధంగా పీఎం కిసాన్ తో పాటుగా మూడు సార్లుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. గత నెలలోనే ఈ నిధులను విడుదల చేస్తారని భావించారు. అయితే, పీఎం కిసాన్ అమలు కోసం వేచి చూసారు. ఇక, ఆగస్టు 2న పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం నిర్ణయించటంతో.. ఏపీ ప్రభుత్వం సైతం అదే రోజున అన్నదాత సుఖీభవ నగదు విడుదల చేయనుంది. ఈ రెండు పథకాల ద్వారా అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల జాబితాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది.
చెక్ చేసుకోండి
రైతు సేవా కేంద్రాల్లో ఈ జాబితాలు అందుబాటులో ఉంచారు. ఎవరైనా రైతులకు అభ్యంతరాలు ఉంటే.. అర్హత ఉండీ పేరు లేకపోతే అక్కడి సిబ్బందికి అర్జీతో పాటుగా అర్హత ఉందని నిర్ధారణ చేసే పత్రాలను సమర్పించాలని అధికారులు సూచించారు. ఇప్పటికే అందిన ఫిర్యాదులను పరిశీలన చేస్తున్నారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోని గ్రీవెన్స్ మాడ్యూల్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. పథకానికి అర్హత సాధించాలంటే ఈకేవైసీ కీలకం. తమ వివరాలు నమోదు చేయించుకుని ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసినవారికే లబ్ధి చేకూరుతుంది. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హుల జాబితాను రైతులు..పరిశీలనతో పాటుగా వివరాలు నమోదు కోసం ప్రభుత్వం www.annadatasukhibhava.ap.gov.in లో అవకాశం కల్పించింది. ప్రభుత్వ యాప్ లోనూ వివరాలు అందుబాటులో ఉంచారు. అయితే, తుది జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఈ నిధులు అందే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications