రేపు పీఎం కిసాన్ నిధులు - అన్నదాత సుఖీభవ ఇలా, చెక్ చేసుకోండి..!!

రైతులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా పీఎం కిసాన్ నిధుల కోసం వేచి చూస్తున్న రైతుల ఖాతాల్లో నిధుల జమకు ముహూర్తం ఖరారైంది. 20వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్దం అవుతోంది. ఇటు ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే ఈ పథకం కోసం అర్హుల జాబితాను దాదాపు ఖరారు చేసారు. అభ్యంతరాల పైన రైతులకు అవకాశం కల్పించారు. దీంతో, రెండు పథకాలు ఒకే సారి అమలు చేస్తే రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమ కానున్నాయి.

రేపు నిధులు
పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 20వ విడత నిధులను ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో జరగ నున్న భారీ బహిరంగ సభలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం ప్రతీ నాలుగు నెలలకు ఒక సారి ఈ పథకం కింద నిధులు విడుదల చేస్తోంది. 19వ విడత నిధులను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్‌ వాయిదాను నెల ముగియక ముందే విడుదల చేశారు. అయితే ఈ సారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది. పీఎం కిసాన్‌ ద్వారా దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. కాగా, పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం మూడు విడతలు గా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.

PM Kisan funds chances to credit in farmers accounts on 18th

అన్నదాత సుఖీభవ
పీఎం కిసాన్ ద్వారా వచ్చే రూ 2 వేలకు ఏపీ ప్రభుత్వం రూ 5 వేలు చొప్పున రెండు సార్లు, రూ 4 వేలు చివరి విడతలో కలిసి ఇవ్వనుంది. దీని ద్వారా మొత్తంగా ఏడాది కాలంలో రైతు ఖాతాలో రూ 20 వేలు జమ కానున్నాయి. ఇక, పీఎం కిసాన్ 20వ విడతకు సంబధించిన నిధులను రేపు (శుక్రవారం) విడుదల చేసేందుకు కేంద్రం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిసి తొలి విడతగా ఏప్రిల్ - జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో చెల్లింపులు చేయనున్నారు. కాగా.. రేపు లేదా ఈ నెల 20న పీఎం కిసాన్ నిధులు విడుదల ఖాయమని చెబుతున్న అధికారులు.. ఆ సమయంలోనే అన్నదాత సుఖీ భవ విడుదలకు సమాయత్తం అవుతున్నారు.

ఇలా చెక్ చేసుకోండి
నిధులు ఖాతాలో జమ కావాలంటే e-KYC తప్పనిసరిగా పూర్తి చేయాలి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవటానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ ఓపెన్ చేసి, Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ ను నమోదు చేసి, క్యాప్చా కోడ్ ​ను ఎంటర్‌ చేయాలి. రిజిస్ట్రేషన్​వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్​చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు Get OTP ఆప్షన్​పై క్లిక్​చేస్తే మీ మొబైల్​కు ఓటీపీ వస్తుంది. ఆ వివరాలు ఎంటర్​చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదని భావిస్తారు. దీంతో, ప్రతీ లబ్దిదారుడికి ఈ విధానం తప్పని సరి చేసారు. దీంతో.. రేపు (18వ తేదీ), లేదంటే 20న ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+