రైతులకు శుభవార్త.. అకౌంట్ లోకి రూ.4వేలు!
ఎంపిక చేసిన రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.4 వేలు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద నగదు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే 13 విడతల నగదును రైతుల ఖాతాల్లో జమ చేశారు. మేలో 14వ విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6 వేలు అందిస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఖాతాల్లో నగదు వేస్తోంది. 14వ విడత నిధుల్లో కొందరు రైతులు ఒకేసారి రూ.4 వేలు పొందే అవకాశం ఉంది. 13వ విడతలో రూ.2వేలు పొందలేనివారు ఈసారి మొత్తం కలిపి రూ.4వేలు జమచేయాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఎంతోమంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

13 విడత నిధులు విడుదల చేయడానికి ముందు తమ వివరాలను వెరిఫికేషన్ చేసుకోనివారికి రూ.2వేలు నిలిచిపోయాయి. గడువు ముగిసిన తర్వాత వారు తమ వివరాలను వెరిఫికేషన్ చేయించుకున్నప్పటికీ రూ.2వేలు జమ అవలేదు. వివరాల వెరిఫికేషన్ లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవాలి. పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్ట్‌లో తమ పేరు ఉందో? లేదో రైతులు వెంటనే తెలుసుకోవడం ముఖ్యం.
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లో బెనిఫిషియరీ లిస్ట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. సబ్ మిట్ చేయగానే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. ఇందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. 14 వ విడత నిధులు ఏప్రిల్-జులై మధ్య కాలంలో రైతుల ఖాతాల్లో జమచేస్తారు.












Click it and Unblock the Notifications