వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది మెగాస్టార్ చిరంజీవికే సాధ్యం - ప్రధాని మోదీ..!!

|
Google Oneindia TeluguNews

మెగాస్టార్ చిరంజీవిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. వరుస ట్వీట్లలో చిరంజీవి వ్యక్తిత్వాన్ని..నటనా సామర్ధ్యాలను అభినందించారు. తాజాగా కేంద్రం మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవ పురస్కారం ప్రకటించింది. సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో అందించిన విశేష సేవలకు గాను చిరంజీవిని భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపిక చేసింది.

చిరంజీవిది అద్భుతమైన వ్యక్తిత్వమంటూ

మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ-2022 అవార్డు దక్కినట్టు కేంద్రం ప్రకటించింది. దీని పైన సినీ రంగ ప్రముఖులతో పాటుగా కేంద్ర మంత్రులు చిరంజీవికి అభినందనలు చెబుతున్నారు. మెగాస్టార్ సోదరుడు పవన్ కల్యాణ్ దీని పైన స్పందించారు. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం తనతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాజాగా ఈ పురస్కారం రావటంతో ప్రధాని మోదీ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేసారు. గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలని ప్రధాని పేర్కొన్నారు.

PM Modi All praises for Chiranjeevi,news making rounds as what could be the matter

స్పందించిన మెగాస్టార్

దీనికి కొనసాగింపుగా.. చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారని ప్రధాని ప్రశంసించారు. ప్రధాని ప్రశంసల పైన చిరంజీవి స్పందించారు. తనకు ఎంతో మంచి అనుభూతి కలిగిందని పేర్కొన్నారు. ప్రధాని ప్రశంసలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పారు. 150 సినిమాల్లో నటుడిగా, డాన్సర్‌గా, నిర్మాతగా పని చేసిన చిరంజీవి తన అద్భుతమైన నటనతో ఎందరో హృదయాలను గెలుచుకున్నారంటూ అభినందించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ట్విట్టర్ ద్వారా చిరంజీవి అభినందనలు చెప్పారు.

మొన్న పవన్ - నేడు మెగాస్టార్ కోసం

ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు కింద పురస్కార గ్రహీతకు నెమలి బొమ్మ కలిగిన రజత పతకం, రూ.10 లక్షల నగదు, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. ఈ అవార్డును గతంలో వహీదా రెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్‌ బచ్చన్, సలీమ్‌ఖాన్‌, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్‌ జోషిలు అందుకున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అందుకోనున్నారు. అయితే, మెగా బ్రదర్స్ పైన ప్రధాని మోదీ తొలి నుంచి అభిమానంతో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం రాజకీయంగా పవన్ ను ఆహ్వానించి సమావేశమైన ప్రధాని..ఇప్పుడు మెగాస్టార్ ను ప్రత్యేకంగా అభినందించటం ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Prime Minister Modi all praised for megastar Chiranjeevi on getting Indian file personality of the year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X