విజయవాడలో మోడీ మెగా రోడ్ షో: చంద్రబాబు, పవన్ ఫుల్ హ్యాపీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడలో బుధవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోడో, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వారికి స్వాగతం పలికారు.
భారీగా వచ్చిన మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో బెజవాడలోని ఆ ప్రాంతమంతా జన సంద్రంగా మారింది. దాడి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ మోడీ, బాబు, పవన్ ముందుకు సాగారు. బెంజి సర్కిల్ వరకు అశేష జన ఈ రోడ్ షో కొనసాగింది.

ఇక, ఎన్డీఏ కూటమికి మద్దతుగా రైతులు, మహిళలు అక్కడికి చేరుకుని అభిమాన నేతకలు మద్దతు తెలిపారు. కాగా, రోడ్ షో అనంతరం ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో కూటమికి వస్తున్న ప్రజాదరణ పట్ల మోడీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా, ఏపీ ప్రజల అభిమానం పట్ల ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ వేదికగా పలు ఫొటోలను పంచుకున్నారు.
We want to improve agricultural productivity, boost industrial growth and ensure AP makes a mark in the services sector too. We want to give wings to the entrepreneurial energy the people of this state are blessed with. pic.twitter.com/XxFxo1VzbP
— Narendra Modi (@narendramodi) May 8, 2024
మోడీ మెగా రోడ్ షోపై చంద్రబాబు, పవన్ ఏమన్నారంటే?
విజయవాడలో మోడీ, పవన్‌తో కలిసి నిర్వహించిన రోడ్ షో సరికొత్త చరిత్ర సృష్టించిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రోడ్ షోలో పాల్గొన్న అభిమానులు, కార్యకర్తలకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు.
A memorable roadshow in Vijayawada with @ncbn Garu and @PawanKalyan. After travelling across AP over the last few days, I am convinced that people are voting for NDA in large numbers. Women and young voters are propelling this surge in support. @BJP4Andhra @JaiTDP @JanaSenaParty pic.twitter.com/STEL36GzYa
— Narendra Modi (@narendramodi) May 8, 2024
భారీ ప్రజాస్పందన ఎంతో థ్రిల్ కలిగించిందని అన్నారు. మూడు పార్టీల అగ్రనేతలకు లభించిన ప్రజాభిమానం ఎన్నికల ఫలితాలు ఆశాజనక వాతావరణానికి నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ 4న కొత్త ప్రభుత్వం నెలకొల్పుతామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Modi road show rally ✊
— pranav💥PSPK❤️🔥 (@CaptainTHOR_17) May 8, 2024
Kalyan babu 🛐🛐💥💥
Benz circle ,vijayawada @PawanKalyan @ncbn @narendramodi#tdpjspbjp#modiroadshow#Vijayawada #kalyanbabu💥#NDAWinning pic.twitter.com/XWRzJuGVUZ
మరోవైపు, విజయవాడలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో విజయవంతం కావడం పట్ల పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మోడీ తలపెట్టిన వికసిత్ భారత్ కోసం తాము నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానితో కలిసి ఏపీలో పాల్గొన్న ఎన్నికల ప్రచారం ఎంతో విలువైనదన్నారు. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు పవన్ కళ్యాణ్.
-
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications