జగన్‌పై దాడి: స్పందించిన ప్రధాని మోడీ, సీఎం స్టాలిన్, షర్మిల షాకింగ్ రెస్పాన్స్, అన్నా అంటూ కేటీఆర్

విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి జగన్ కనుబొమ్మపై భాగంలో తాకింది. దీంతో ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే జగన్ కు వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

కాగా, సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర పార్టీల నేతలు స్పందించారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరోవైపు, తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, తదితరులు కూడా దాడి ఘటనపై స్పందించారు.

pm modi and other leaders responded on stone attack ap cm ys jagan issue

జగన్ పై దాడిని ఖండించిన సీఎం స్టాలిన్

ఏపీ సీఎం జగన్ పై రాయి దాడిని ఖండించారు తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. రాజకీయాల్లో బేధాభిప్రాయాలుంటాయని, అయితే, హింసకు తావులేదన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవాలన్నారు. సీఎం జగన్ త్వరగా కోలుకోవాలని స్టాలిన్ ఆకాంక్షించారు.

ఓర్వలేకే దాడులు: పేర్ని నాని

సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఇలా దాడులు చేయడానికి తెగబడ్డారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ను ఏమీ చేయలేక రాళ్ల దాడి చేశారన్నారు. సీఎం జగన్ కు లోతుగా గాయమైంది. రెండు కుట్లు పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు. తల నుంచి రక్తం కారుతుంటే వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. త్వరలోనే సీఎం జగన్ పై ఎవరు దాడి చేయించారో అన్నీ బయటపడతాయన్నారు.

జగన్‌పై దాడి: షర్మిల షాకింగ్ స్పందన

జగన్ పై రాళ్ల దాడి ఘటనను ఖండించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. 'ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై దాడి జరిగి...
ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం. అలా కాకుండా, ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని సోషల్ మీడియా వేదికగా షర్మిల పేర్కొన్నారు.

జగనన్న.. త్వరగా కోలుకోవాలంటూ కేటీఆర్

సీఎం జగన్‌పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఆయన క్షేమంగా ఉన్నందుకు సంతోషమన్నారు. టేక్ కేర్ అన్నా అని కేటీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+