సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్, కీలక చర్చ..!!

ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసారు. ఏపీ పై అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంపై ఆరా తీసారు. వారం రోజుల వ్యవధిలో రెండు తుఫాన్ల తాకిడి నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావం... ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రైతులకు భారీ నష్టం వాటిల్లిందని సీఎం చెప్పారు.

ఏపీపై వరుసగా విరుచుకుపడిన రెండు తుఫాన్ల పైన సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్ చేసారు. నష్టం పై ఆరా తీసారు. రహదారులు, విద్యుత్ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని... ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తుఫాన్ సహయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేసిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. నిరంతర అప్రమత్తతతో తుఫాన్ వల్ల వచ్చిన ఇబ్బందులను సమర్ధ వంతంగా అధిగమించారంటూ సీఎం చంద్రబాబును ప్రధాని ప్రశంసించారు. ఇదే సమయంలో ఆర్నాబ్ తుఫాను కారణంగా జరిగిన నష్టం వివరాల పైన కేంద్రానికి ఇచ్చిన నివేదిక పైనా ప్రస్తావన చేసినట్లు సమాచారం. దాదాపుగా రూ 4,700 కోట్ల మేర ఆర్నాబ్ తుఫానుతో రాష్ట్రానికి నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేసారు.

 వంగవీటి రాధా ఘన విజయం.. మెజార్టీ: ABV కి దక్కిన ఓట్లు, రెండో స్థానం..!!
వంగవీటి రాధా ఘన విజయం.. మెజార్టీ: ABV కి దక్కిన ఓట్లు, రెండో స్థానం..!!
pm-modi-calls-cm-chandrababu-to-review-impact-of-two-cyclones-in-andhra-pradesh-here-the-details

కేంద్ర సాయం కోరిన సీఎం చంద్రబాబు

కాగా, ఏపీని వరుస తుపాన్లు తీవ్రంగా దెబ్బతీశాయని.. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. గతంలో వచ్చిన 'అర్నబ్' తుపాను నష్టం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే తాజాగా 'మురసు' తుపాను మరోసారి తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని లేఖలో వివరించారు. వరుస ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలోని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తుపాను ప్రభావం అధికంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఒక తుపాను కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి మరో తుపాను రూపంలో ఎదురైన విపత్తు ఆర్థికంగా మరింత భారంగా మారిందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. మురసు తుపాను కారణంగా రాష్ట్రంలోని ఎనిమిది ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రాథమికంగా రూ.343.95 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+