ప్రపంచంలోనే ఒక్కడు.. చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ!

టీమిండియా రన్ మెషీన్, కింగ్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో మరో అరుదైన చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు ఏ బ్యాటర్ సాధించని మహత్తర రికార్డును నెలకొల్పాడు. 38 ఏళ్ల వయస్సుకు చేరువవుతున్నా.. వయస్సుతో సంబంధం లేకుండా తన అద్భుతమైన క్లాస్ ఇన్నింగ్స్‌లతో స్టేడియంలో పరుగులు పిండుకుంటూ సరికొత్త అధ్యాయాన్నిలిఖించాడు.

Ind vs NZ ODI: న్యూజీలాండ్ తో వన్డేల్లో భారత్ కు అతిపెద్ద సమస్య ఇదేనా?
Ind vs NZ ODI: న్యూజీలాండ్ తో వన్డేల్లో భారత్ కు అతిపెద్ద సమస్య ఇదేనా?

నంబర్-3 స్థానంలో 13 వేల పరుగుల ప్రపంచ రికార్డు
వన్డే క్రికెట్లో నంబర్-3 బ్యాటింగ్ స్థానాన్ని జట్టుకు అత్యంత కీలకమైన రీతిలో పరిగణిస్తారు. ఈ స్థానంలో బ్యాటింగ్ కు దిగి వన్డే చరిత్రలోనే ఏకంగా 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న ప్రపంచంలోనే తొలి, ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ ఘనత అందుకోవడానికి విరాట్ కోహ్లీకి కేవలం 12 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి.

IND vs NZ 1st ODI Virat Kohli Becomes First Batter to Score 13 000 Runs at No 3 Details

రికీ పాంటింగ్ రికార్డు బ్రేక్
న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 186 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ తాను ఎదుర్కొన్న 13వ బంతికి 12వ పరుగు పూర్తి చేయగానే ఈ అరుదైన మైలురాయి దాటాడు. ఆ క్షణంలో ఈడెన్ పార్క్ స్టేడియం అంతా అభిమానుల కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. వన్డే చరిత్రలో నంబర్-3 స్థానంలో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు ప్రపంచంలో కేవలం ఇద్దరే ఉన్నారు. ఇందులో విరాట్ కోహ్లీ (13, 000+ పరుగులు) అగ్రస్థానంలో నిలవగా.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(12,662) రెండో స్థానంలో ఉన్నాడు.

Ind vs New Zealand: ఐదో టీ20లో ఆరంభంలోనే అభిషేక్, శాంసన్ ఔట్..ఆ తర్వాత..!
Ind vs New Zealand: ఐదో టీ20లో ఆరంభంలోనే అభిషేక్, శాంసన్ ఔట్..ఆ తర్వాత..!

నంబర్-3 స్థానంలో కోహ్లీ రికార్డుల సునామీ
విరాట్ కోహ్లీ తన స్థిరమై బ్యాటింగ్ ప్రదర్శనతో రికార్డుల సునామీని నెలకొల్పాడు. నంబర్-3లో విరాట్ కోహ్లీ ఏకంగా 61.55 సగటు, 95.4 స్ట్రైక్ రేట్ తో ధాటిగా పరుగులు సాధించాడు. అంతేకాకుండా ఈ ఒక్క స్థానంలోనే విరాట్ కోహ్లీ 48 సెంచరీలు, 69 హాఫ్ సెంచరీలు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.

సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్ను
అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఏదైనా ఓ నిర్దిష్ట బ్యాటింగ్ ఆర్డర్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్(ఓపెనర్‌గా 15,310 పరుగులు) పేరిట ఉంది. ఇప్పుడు నంబర్-3 స్థానంలో 13,000 పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ.. సచిన్ నెలకొల్పిన ఆల్-టైమ్ మహత్తర రికార్డు వైపు శరవేగంగా అడుగులు వేస్తున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+