"2029 ఎన్నికల భయం"-ఒక్క ముక్కలో తేల్చేసిన సాయిరెడ్డి.. !

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ఎన్నికలకు ముందే నామినేషన్లను ఏకగ్రీవం చేసుకున్న కూటమి పార్టీలు.. పోలింగ్ లో సైతం పోలీసుల సాయంతో విపక్షాల్ని అడ్డుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కుంటున్నాయి. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల్ని కూటమి క్లీన్ స్వీప్ చేసేసింది. దీనిపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో కూటమి విజయంపై.. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ కోటను కూల్చిన టీడీపీ..! ప్రతీకారం తీర్చుకున్న చంద్రబాబు..!
జగన్ కోటను కూల్చిన టీడీపీ..! ప్రతీకారం తీర్చుకున్న చంద్రబాబు..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడించినది ప్రతిపక్షాన్నా లేక ప్రజలనా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం కంటే భయం ఎక్కువగా కనిపిస్తోందని సాయిరెడ్డి తెలిపారు. పోలీసుల్ని గుండాలుగా, గుండాల్ని మాఫియాలుగా మార్చి ఈ ఎన్నికలు జరిపారని ఆయన ఆక్షేపించారు. కాబట్టి ఓడినది ప్రజలు అన్నారు. టీడీపీలో 2029 భయం మరింత పెరగటానికి ఈ ఎన్నికల ఫలితాలు బాగా ఉపయోగపడతాయని సాయిరెడ్డి ఫైనల్ గా తేల్చిచెప్పేశారు.

Vijayasai Reddy Says Local Poll Results Reflect TDP s Fear of 2029 Elections
చీరాల కౌంటింగ్ వాయిదా..! ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ..!
చీరాల కౌంటింగ్ వాయిదా..! ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల సాయంతో కూటమి పార్టీలు ఎన్నికల్ని గెలిచాయన్న ఆరోపణల్ని ప్రభుత్వం ఖండిస్తోంది. గతంలో వైసీపీ హయాంలో దాడులు, దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయని వాదిస్తోంది. మరోవైపు విపక్ష వైఎస్సార్సీపీ మాత్రం ఎన్నికల్లో దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దాడులపై స్పందించకుండా ప్రభుత్వానికి వంత పాడిందని విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఓసారి దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. ఇప్పుడు ఫలితాల తర్వాత మరోసారి అత్యున్నత న్యాయస్దానాన్ని ఆశ్రయించేందుకు సిద్దమవుతోంది. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కూడా దీనికి మద్దతుగానే ఉందన్న చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+